ఉసిరి..ఔషధాల సిరి: కార్తీకమాసంలో ఎందుకు పూజిస్తారు?: వనభోజనాల్లో ఈ మొక్క ప్రాముఖ్యత ఏంటీ

ఉసిరికాయలో ఉండే ఔషధ గుణాలు తెలిస్తే.. దాన్ని తినడాన్ని మానుకోలేరు. కార్తీక మాసంలో ఈ ఉసిరేగ్గాయను పూజల్లో వినియోగిస్తుంటారు. ఉసిరి మీద దీపాలను వెలిగించి.. వాటిని మహాశివుడికి అర్పిస్తుంటారు భక్తులు. విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది ఇందులో. ఆయుర్వేదంలో దీనికి ఉండే ప్రాధాన్యతే వేరు. సర్వరోగ నివారిణిగా భావిస్తుంటారు. ఉసిరికాయ చెట్లు, మొక్కల మధ్య కార్తీక మాసంలో వన భోజనాలు చేయాలని చెబుతుంటారు పండితులు.

 గాలి పీల్చినా..

గాలి పీల్చినా..

ఉసిరి చెట్ల మీదుగా వీచే గాలి కూడా మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందంటే నమ్మశక్యం కాకపోవచ్చు. ఈ చెట్ల మీదుగా వీచే గాలి శ్వాసకోస సంబంధ ఇబ్బందులను నివారించగలుగుతుంది. మెదడు చురుకుగా పని చేసేలా ప్రేరేపిస్తోంది. దగ్గును నయం చేసేంతటి శక్తి ఉసిరికాయల చెట్ల మీదుగా వీచే గాలికి ఉందని పెద్దలు చెబుతుంటారు. ఉసిరికాయ సాధారణంగా వర్షాకాలం, చలికాలంలో లభిస్తుంటుంది. సీజనల్‌గా మార్కెట్‌లో కనిపిస్తుంటుంది.

కనీసం ఒక్కటైనా..

కనీసం ఒక్కటైనా..

ఉసిరికాయ దొరికినన్ని రోజులూ.. రోజులో కనీసం ఒక్కసారైనా దాన్ని తింటే శరీరంలోనే అనేక రోగాలు నయం అవుతాయి. అన్ని రకాల పైత్యం, కఫం తగ్గుతుంది. జీర్ణక్రియ అద్భుతంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. త్రిదోషాలు నివారించడానికి ఉసిరికాయ దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. కిడ్నీలో ఉండే రాళ్లను సైతం కరిగించే శక్తి ఉసిరికాయ రసానికి ఉంది. కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కామెర్లు.. కాలేయ సమస్యలు..

కామెర్లు.. కాలేయ సమస్యలు..

కామెర్లు, హెపటైటిస్,కాలేయ ఆరోగ్యానికి నేల ఉసిరి దివ్య ఔషధమేనని చెప్పాలి. కాలేయం సమస్యలు వల్ల ఏర్పడే కంటి సమస్యలకు చికిత్స చేయడానికి నేల ఉసిరి రసం మంచిది. ఈ రసాన్ని ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరు వెచ్చని నీటితో సేవించడం వల్ల కంటి సమస్యలు తొలగిపోతాయి. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఈ రసాన్ని తీసుకోవడం బెస్ట్ ఆప్షన్‌గా పరిగణిస్తారు. అస్తమా, బ్రోన్కైటిస్ వంటి సమస్యలను డాక్టర్ అవసరం లేకుండా నివారించుకోవచ్చు.

ఉసిరి తేనే..అద్భుత కాంబినేషన్..

ఉసిరి తేనే..అద్భుత కాంబినేషన్..


ఉసిరి రసాన్ని తేనెతో కలిపి రెండు సార్లు సేవించడం వల్ల అస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ముడతలు పడనివ్వదు. తేనెతో కలిపిన ఉసిరి రసాన్ని సేవించడం వల్ల చర్మం కాంతిమంతమౌతుంది. ఉసిరికాయను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలను తొలగించుకోవచ్చు. బరువు తగ్గడానికీ ఇది ఉపయోగపడుతుంది. ఉసిరికాయ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం.. మలబద్ధకాన్ని నిర్మూలించుకోవచ్చు. మలబద్ధకాన్ని నివారించడానికి ఉద్దేశించిన ఆయుర్వేద మందుల్లో ఉసిరిని తప్పనిసరిగా వినియోగించడానికి ప్రధాన కారణం అదే. దీని రసాన్ని తాగడం వల్ల రక్త హీనత నుంచి బయటపడొచ్చు.

 కార్తీక పూజల్లో..

కార్తీక పూజల్లో..

ఇలాంటి ఎన్నో అద్భుత ఔషధ గుణాలను కలిగిన ఉసిరికాయకు పురాణాల్లోనూ ప్రత్యేక స్థానం ఉంది. కార్తీకమాసం పూజల్లో దీన్ని తప్పకుండా వినియోగిస్తారు. తులసి చెట్టుతో సమానంగా ఉసిరిని పూజిస్తారు. ఇందులో- వైష్ణవ సంప్రదాయం, శైవ సంప్రదాయం అనే తేడాలు ఉండవు. ఒక్కొక్కరు ఒక్కోలా ఈ చెట్టు, మొక్కలను పూజిస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+