అక్టోబర్ నెల 2018 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు


డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్. 

గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి,గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము.మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి,ఇది గమనించగలరు.కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను,తరునోపాయలను అడిగి తెలుసుకోగలరు, జైశ్రీమన్నారాయణ.

మేషరాశి

ఈ నెలలో అవివాహితులకు వివాహ యోగం ఉన్నది.మీ అంచనాలు నిజం అవుతాయి.వ్యక్తిగత కక్షలను తగ్గించుకుంటారు.సోమరితనం తగ్గును కాని కోపతాపాలు పెరుగును.విధాన నిర్ణయాలలో లోపాలు ఉండవు.ఉన్నత పదవుల భాద్యతలు పెరుగుతాయి.దూరప్రాంత ప్రయాణాలు అనుకూలంగా సాగి సంతృప్తిని ఇస్తాయి.ఆదాయపరంగా అనుకూలంగా ఉంటుంది.వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ భాదలు తోలగుతాయి.

వృషభరాశి

ఈ నెలలో శుభకార్య నిర్వహణ సిద్ధిస్తుంది.సంతాన పరమైన విషయాలలో అనుకూలం.ప్రధాన శత్రువు ఆరాపై ధనవ్యయం కలుగుతుంది.వృత్తి వ్యాపారాలలో కార్యసిద్ది కలుగుతుంది.ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి.అపూర్వ దైవ దర్షణాలు కలుగుతాయి.విహార యాత్రలకు అనుకూలంగా ఉంటుంది.అందరితో అనుకూలంగా ఉంటు వ్యాపార వ్యవహార అభివృద్ధిని పెంచుకుంటారు.ఇంటి అలంకరణ కోరకు ధనం ఖర్చు చేస్తారు.నెలాఖరున ఆశాంతి నెలకొంటుంది జాగ్రత్తలు వహించాలి. పేదలకు కడుపు నిండ వారు సంత్రుప్తి పడేలాగా భోజనాలు పెట్టించండి,పశు,పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిథునరాశి

ఈ నెలలో ప్రతి విషయంలో సహానం పాటించాలి.ఋణల ఒత్తిడి అధికమౌతుంది.అసత్యాలతో అపజయాలు ఎదురౌతాయి.శుభకార్య నిర్ణయ చర్చలు విజయవంతమగును.అంచనాలతో ఉహలతో చేసే పనులకు అనుకూలం కాదు.అవివాహితులకు శుభవార్తలుంటాయి.భూ,గృహ,ధన విషయాలలో అనుకూలతలున్నాయి.శతృవుల వలన మనస్సు ఆందోళనలు,శిరో వేదనలుంటాయి.వృత్తి రంగాలలో అనుకూలంగా ఉంటుంది.కొత్త స్నేహితులు ఏర్పడతారు.అనుకూలమైన శుభాల కోరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,నీళ్ళను వాటికి అందివ్వండి ఆలాగే ప్రతి రోజు విష్ణు సహస్ర నామలు చదవడం,లేదా వినడం వలన మీకు ఎంతో మేలు కలుగుతుంది,

కర్కాటకరాశి

ఈ నెలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు.వృత్తి వ్యవహారాలలో కొత్త ఒరవడి సృష్టించు కుంటారు.పిల్లల విషయంలో శ్రద్ద చూపవలసి ఉంటుంది.కుటుంబ సమస్యల నుండి గట్టేక్కుతారు.శత్రువుల బెడద తగ్గుతుంది.మీ పై ఉండే పోరు తగ్గుతుంది.మీ బుద్ధి బలంతో పనులలో విజయాలు చేకూరుతాయి.రహస్య అంశాలపై చర్చలు చేయవద్దు.భాగస్వామ్య నిర్ణయాలు నెరవేరును.బంధువుల ఆదరణ సంపాదిస్తారు.అవివాహితులకు వివాహ యోగం ఉంది.నూతన నిర్ణయాలు తీసుకుంటారు,వాటి ఫలితం కొరకు శ్రమిస్తారు.పేదలకు కడుపు నిండ వారు సంత్రుప్తి పడేలాగా భోజనాలు పెట్టించండి,పశు,పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహం రాశి :

ఈ నెలలో శత్రువుల బెడద తగ్గును.ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి.ప్రతి బంధక మైన సమస్యలు తగ్గును.అవివాహితులకు వివాహ యోగం ఉంది.ఆలస్య ఒప్పందాలు అనుకోకుండా ఫలిస్తాయి.రహస్య మంతనాలు వివాదం కాకుండా చూసుకోవాలి.మిత్ర,శత్రువులను గమనిస్తూ ఉండాలి.అంచనాలతో పనిచేసే పనులు నెరవేరవు.శత్రువులపై విజయం సాధిస్తారు.చేయు వృత్తి,విద్యారంగంలో ప్రాముఖ్యతను పెంచుకుంటారు.ఇతర ఆదాయ మార్గాలను పెంచుకుంటారు.అనుకూలమైన శుభాల కోరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,నీళ్ళను వాటికి అందివ్వండి ఆలాగే ప్రతి రోజు విష్ణు సహస్ర నామలు చదవడం,లేదా వినడం వలన మీకు ఎంతో మేలు కలుగుతుంది,

కన్యారాశి

ఈ నెలలో పౌరుషాలకు పోయి సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది,కొంత జాగ్రత్తలు అవసరం.చలాకీతనం పెరుగును.శాంత స్వభావంచేత అనుకూలతలు ఏర్పడాతాయి.విమర్షణలను తట్టుకుంటారు.సంతానం తప్పుదారి పట్టకుండా జాగ్రత్త పడుతారు.ముఖ్యమైన వ్యవహారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.శత్రువర్గ సమాచారాన్ని సేకరిస్తారు.శుభకార్యలకు విజ్ఞం కలుగకుండా జాగ్రత్త పడుతారు.సోదరులతో విభేద సూచనలు ఉన్నాయి.పుణ్యకార్యలలో పాల్గోంటారు.పేదలకు కడుపు నిండ వారు సంత్రుప్తి పడేలాగా భోజనాలు పెట్టించండి,పశు,పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి

ఈ నెలలో గృహ నిర్మాణ పనులను శ్రద్ధగా నిర్వహిస్తారు.సంతాన పరమైన ఖర్చులు ఉంటాయి.రెండవ పక్షంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.మిత్ర భేదాలు,బందువులతో శత్రుత్వాలు మొదలగునవి ఏర్పడే అవకాశాలున్నాయి జాగ్రత్తలు వహించాలి.వ్యవహారంలో సమస్యలు ఉన్నా ఆర్ధికంగా ఎదుగుతారు.కార్యదీక్ష భాద్యత అవసరం.ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాలి.అనుకూలమైన శుభ ఫలితాల కోరకు పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను,త్రాగడానికి నీళ్ళను వాటికి అందివ్వండి ఆలాగే ప్రతి రోజు విష్ణు సహస్ర నామలు చదవడం,లేదా వినడం వలన మీకు ఎంతో మేలు కలుగుతుంది,

వృశ్చికరాశి

ఈ నెలలో రాబడికి మించిన ఖర్చులుంటాయి.కొత్త వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి.అనుమానలు తొలగి అనుభవంతో పనులను సాధిస్తారు.జీవనోపాధి విషయంలో స్థిరత్వం లోపించును.అనవసర విషయాలను తగ్గించి వివేచనతో ఆదాయ మార్గం అన్వేషిస్తారు.నెలాఖరున నూతన ఆలోచనలకు శ్రీకారం చుడుతారు.కుటుంబంలో సుఖశాంతులు నెలకోంటాయి.బంధువుల సహకారంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.పేదల కొరకు మీ చేతనైన సహాయం చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి

ఈ నెలలో సమయ స్పూర్తితో సామరస్యంగా పనులను నెరవేర్చుకుంటారు.ఖచ్చిత నిర్ణయాలు ఉండును.శుభకార్యాచరణ చేత మనస్సుకు శాంతి కలుగుతుంది.స్నేహ బంధాలు బలపడుతాయి.పెద్దల ఆశీస్సులు లభించును.భూ,గృహ మార్పులుండును.తోబుట్టువుల మధ్య అంగీకారం కుదురును.సాంస్కృతిక,పర్యాటక రంగాలలో విశేషంగా రానిస్తారు.నూతన విషయాలలో వాయిదా వేయకుండా ఉండుట మంచిది.కోర్టుకు సంబంధించిన విషయాలలోఅనుకూలంగా ఉంటుంది.పశు,పక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరం

ఈ నెలలో భాగస్వామ్య వ్యవహారాలలో నమ్మక ద్రోహం వాటిల్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తగు జాగ్రత్తతో ఉండండి.స్ఠిర నిర్ణయాలు వాయిదా పడుతాయి.బంధు ప్రేరణకు ప్రాధన్యతను ఇవ్వరు.ఆర్ధిక ఇబ్బందులు కొంత తగ్గుతాయి.విమర్షలు,నిందలు అధికమౌతాయి.న్యాయ స్థాన లావాదేవిలలో ఉపశమనం ఉంటుంది.స్థాన చలనంలో లబ్ధి ఉంటుంది.భయాందోళనలు తగ్గుతాయి.తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు.నల్ల చీమలకు పంచదార వేయండి.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

కుంభరాశి

ఈ నెలలో శరీరంపై గాయాలు అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి.స్థిరాస్తికి సంబంధించిన అంశాలలో నిదానంగా నిర్ణయాలుంటాయి.అంచనాలు తారుమారు అవుతాయి.లాభాల కొరకు నూతన ప్రయత్నాలు చేస్తారు.మోకాలు రుగ్మతులు ఏర్పడే అవకాశం ఉంది.శుభకార్య చర్చలు సఫలం అవుతాయి.సహస కార్యాలపై దృష్టి తగ్గించండి.తక్కువ శ్రమ ఎక్కువ లాభాలు పొందుతారు.నూతన వాహన సౌఖర్యం ఉంటుంది.గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి.నూతన పరిచయాల ద్వార ఇంట్లో తగాదాలు ఉంటాయి జాగ్రత్త.పేదలకు కడుపు నిండ వారు సంత్రుప్తి పడేలాగా భోజనాలు పెట్టించండి,పశు,పక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి

ఈ నెలలో గృహ వాతవరణం ఆశాజనకంగా ఉంటుంది.వ్యక్తి గత ఆకర్షణలకు ధనవ్యయం కలుగుతుంది.శుభకార్య నిర్వహణలకు మార్గం సిద్ధం అవుతుంది.ఉన్నత స్థాయి పరిచయాలు అనుకూలమైన ఫలితాలు పొందుతారు.కృషికి తగిన ఫలితం ఉంటుంది.హామి ప్రయత్నాలు చేస్తారు.వైద్య పరంగా ధన వ్యయం ఉంటుంది.వ్యక్తి గత కక్షలు తగ్గిస్తారు.మీరు వేసిన అంచనాలు అనుకూలిస్తాయి.వ్యాపార లావాదేవీలలో విజయం కనిపిస్తుంది.రాజకీయ లబ్ధి పొందుతారు.అనుకూలమైన శుభాల కోరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,త్రాగడానికి నీళ్ళను వాటికి ఏర్పాటు చేయండి.

Have a great day!
Read more...

English Summary

The monthly forecasts for 2017 August cover all the star signs from Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius to Pisces.