అప్పుడే ఓటీటీలోకి తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. రెండు నెలలు తిరక్కుండానే మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. శర్వా హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'బైకర్'.. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే శర్వానంద్ 'బైకర్'మూవీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మోటో క్రాస్ రేసింగ్ అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కిన నేపథ్యంలో రిలీజ్ కు ముందే సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.

ప్రేక్షకుల అంచనాల మధ్య ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దేశంలోనే మోటో క్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన తొలి చిత్రంగా బైకర్ నిలిచింది. ఈ సినిమాలో శర్వానంద్ తండ్రి పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ మెప్పించారు. ఆయన క్యారెక్టర్ ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్. శర్వానంద్, రాజశేఖర్ మధ్య వచ్చే ఎమోషనల్ సెంటిమెంట్ సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. స్క్రీన్ పై వాటిని అందంగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు అభిలాష్ రెడ్డి సక్సెస్ అయ్యారు.

ఇక ఈ మూవీలో హీరోయిన్ గా మాళవికా నాయర్ నటన ఆకట్టుకుంటుంది. శర్వానంద్ భార్యగా ఆమె కీలక పాత్రలో మెప్పించింది. ఇక ఈ మూవీలోని బైక్ రేసింగ్ సీక్వెన్స్ లు ఉత్కంఠభరితంగా ఉంటాయి. విజువల్స్ మాత్రం హాలీవుడ్ రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయి. ఇక చివరి 30 నిమిషాలు బైక్ రేసింగ్ ను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు అభిలాష్ రెడ్డి. ఈ మూవీలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Sharwanand Biker Film Set for Netflix Release on May 1 Official Confirmation Still Pending Sharwa

బైకర్ మూవీకి జిబ్రాన్ మ్యూజిక్ బిగ్ ప్లస్. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మే 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+