విజయ్ దేవరకొండతో లిప్‌లాక్‌కు రెడీ .. రష్మిక కంటే నేనే బెస్ట్
బుల్లితెర ప్రేక్షకులకు 'బ్రహ్మముడి' సీరియల్ ద్వారా సుపరిచితురాలైన నటి దీపిక రంగరాజు(కావ్య) తాజాగా చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. జబర్దస్త్ వర్ష నిర్వహిస్తోన్న "కిస్సిక్" టాక్ షోకు అతిథిగా హాజరైన దీపిక.. తన కెరీర్, వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి మనసు విప్పి మాట్లాడింది. ముఖ్యంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండపై ఆమె చేసిన కామెంట్స్ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఎలాంటి సీన్ చేయడానికైనా సిద్ధం
తమిళనాడుకు చెందిన దీపిక రంగరాజు వృత్తిరీత్యా ఇంజనీర్ అయినప్పటికీ.. నటనపై మక్కువతో న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సీరియల్ నటిగా మారింది. తెలుగులో 'బ్రహ్మముడి' సీరియల్ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ షోలో ఆమె మాట్లాడుతూ.. కెమెరా ముందుకు వచ్చినప్పుడు నటిగా ఎలాంటి సీన్ చేయడానికైనా తాను సిద్ధమని.. సిగ్గు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆన్‌స్క్రీన్ రొమాన్స్ గురించి ప్రస్తావిస్తూ ఆర్టిస్ట్ అనే వారు ఏ పాత్రకైనా 'నో' చెప్పకూడదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

కిస్ సీన్ చేస్తారా?
ఇక తన క్రష్ గురించి చెబుతూ.. టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున అంటే తనకు అమితమైన ఇష్టమని, ఆయన ఛార్మ్ తనను ఎంతో ఆకర్షిస్తుందని దీపిక తెలిపింది. అదే సమయంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటే కూడా తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో యాంకర్ వర్ష ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేస్తూ.. "విజయ్ దేవరకొండతో లిప్‌లాక్ లేదా కిస్ సీన్ చేయాల్సి వస్తే చేస్తారా?" అని అడిగింది.
ఈ క్రమంలో దీనికి దీపిక ఏమాత్రం తడబడకుండా ఎంతో బోల్డ్‌గా సమాధానమిచ్చారు. "రష్మిక మందన్న గారేంటి? నేనెంత బాగా చేస్తానో తెలుసా?" అంటూ ఆమె సరదాగా, ధీటుగా బదులిచ్చారు. రష్మిక కంటే తానే విజయ్ పక్కన బాగా నటించగలనని ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు తన కో-స్టార్ మానస్ గురించి కూడా మాట్లాడుతూ.. అతను తనకు ఎంతో సపోర్టివ్‌గా ఉంటాడని, ముఖ్యంగా తనకు డాన్స్ రాకపోయినా ఎంతో సహకరిస్తాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ షో ప్రోమో, దీపిక కామెంట్స్ బుల్లితెర వర్గాల్లో సందడి చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications