మహిళా బిల్లు వీగిపోయిన వేళ జమిలి పై కీలక పరిణామాలు, ఇక నెక్స్ట్..!!
జమిలి ఎన్నికల పై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం కొనసాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు లోక్ సభలో వీగిపోయింది. దీంతో, డీలిమిటేషన్ బిల్లును కేంద్రం విత్ డ్రా చేసుకుంది. ఈ సమయంలో జమిలి ఎన్నికల నిర్వహణ పైన కొత్త చర్చ మొదలైంది. జమిలి బిల్లులకు అసెంబ్లీల ఆమోదం అవసరం లేదని లా కమిషన్ తేల్చి చెప్పింది. దీంతో.. వచ్చే పార్లమెంట్ సమావేశాల వేదిక గా కేంద్రం కీలక నిర్ణయానికి సిద్దం అవుతోంది. ఈ దిశగా కసరత్తు మొదలైంది.
మహిళా రిజర్వేషన్ల బిల్లు తిరస్కరణ తరువాత జమిలి పైన కొత్త చర్చ మొదలైంది. 2029 ఎన్నికల్లో లోక్ సభ, శాసనసభకు కలసి ఎన్నికలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు ప్రారంభించింది. ప్రధానంగా డీ లిమిటేషన్ చేసి పార్లమెంటు స్థానాల సంఖ్య 850కు పెంచి 2029 జమిలి ఎన్నికలకు వెళ్లాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన చేసింది. అయితే లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మహిళ రిజర్వేషన్ బిల్లుతో పాటు డీ లిమిటేషన్ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. అయితే.. డీలిమిటేషన్ ఇక 2029 నాటికి సాధ్యం కాదనే అభిప్రాయం వేళ జమిలి ఎన్నికల పైన కేంద్రం నిర్ణయం కీలకంగా మారుతోంది. లోక్ సభ స్థానాలు పెరిగి జమిలికి వెళ్తే కలిసి వస్తుందని అంచనా వేసారు. కాగా.. ఇప్పుడు డీ లిమిటేషన్ లేకపోవటంతో ఈ నిర్ణయం ఇక ఉండదని భావిస్తున్న వేళ.. కొత్త చర్చ మొదలైంది.

కొత్త ఆలోచనల పై కేంద్రం కసరత్తు
కాగా.. డీలిమిటేషన్ సాధ్యం కాకపోయినా.. జమిలికి వెళ్లటం ద్వారా అధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటంతొ.. పాజిటివ్ వేవ్ కలిసి వస్తుందని కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. మహిళా బిల్లు విషయంలో పార్లమెంట్ లో భంగపాటుకు గురైన కేంద్రం.. జమిలి విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. కాగా.. దీని పైన ఇంకా తుది నిర్ణయం జరగలేదు. న్యాయ పరమైన అంశాలతో పాటుగా.. రాజకీయంగా సమీకరణాల పైన కసరత్తు చేస్తున్నాయి. అదే విధంగా మహిళా రిజర్వేషన్ల బిల్లును త్వరలో జరిగే వర్షాకాల సమావేశాల్లో తిరిగి ప్రవేశ పెట్టేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ బిల్లు సమయంలోనే జమిలి ప్రతిపాదన తీసుకొచ్చి విపక్షాలకు షాక్ ఇవ్వాలనేది బీజేపీ ముఖ్య నేతల ఆలోచన. పూర్తి సమాయత్తం అయిన తరువాత నే ఈ జమిలి పైన కేంద్రం తుది నిర్ణయం అధికారికంగా వెల్లడించనుంది.












Click it and Unblock the Notifications