10 రోజుల్లో ఈ ఆలయాలన్నీ చుట్టేయొచ్చు.. తక్కువ ధరకే రైల్వే బంపరాఫర్..
భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం.. మనదేశంలో ఉన్నన్ని ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఏ దేశంలోనూ కనిపించవు. ఇక్కడ ఉన్నన్ని ఆలయాలు ఎక్కడా ఉండవు. భారత్ లో రకారకాల మతాల ప్రజలు కలిసికట్టుగా జీవనం సాగిస్తుంటారు. అయితే మనదేశంలోని చాలా ప్రముఖమైన ఆలయాలన్నీ చుట్టేయాలని చాలామందికి కోరిక ఉంటుంది. కానీ బడ్జెట్ కారణంగా.. ఎలా వెళ్లాలో తెలియక ఆగిపోతుంటారు. అయితే రైల్వేశాఖ మీకోసం ఓ గొప్ప ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రస్తుతం వేసవి సెలవులు కారణంగా చాలామంది తమ ఫ్యామిలీస్ తో కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే పర్యటకులు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారనే ఉద్దేశ్యంతో భారత్ గౌరవ్ దివ్య దక్షిణ యాత్ర పేరుతో రైల్వే శాఖ ఈ క్రేజీ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 27 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. మొట్టమొదటి సారిగా ఈ యాత్ర విశాఖపట్నం నుంచి ప్రారంభం కానున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.
ఏప్రిల్ 27న ప్రారంభమయ్యే ఈ యాత్ర మొత్తం 9 రోజులపాటు సాగుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా పర్యటకులు అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం, మధురై, తిరుచ్చి, తంజావూర్, తిరువన్నామలై ప్రాంతాల్లోని కామాక్షి అమ్మన్, తీర దేవాలయం, రామనాథ స్వామి, మీనాక్షి అమ్మన్, శ్రీ రంగనాథ స్వామి ఆలయం, బృహదీశ్వర ఆలయం ఇలా అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించే వీలుంటుంది. ఇక ఈ టూర్ ఏప్రిల్ 27న ప్రారంభమై మే 4న విశాఖపట్నం చేరుకోవడంతో ముగుస్తుంది.

ఇక టికెట్ ధరల వివరాలు చూస్తే పెద్దలకు ఒక్కొక్కరికి రూ. 14,700 లుగా కేటాయించారు. అలాగే పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 13,800 గా ఉంది. ఈ టూర్ లో భాగంగా స్లీపర్ క్లాస్ ప్రయాణంతోపాటు భోజన సౌకర్యం ఉంటుంది. దాంతోపాటుగా రోడ్డు రవాణా, హోటల్ వసతి తదితర అంశాలు కూడా ప్యాకేజీలో ఉన్నాయి. ఇక ఈ దివ్య దక్షిణ యాత్ర టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం సంబంధిత 9281030748, 92814 95847, 9281495837, 9550166168 నంబర్లను సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications