“ఫ్రీలింక్ కమ్యూనికేషన్” ఫీచర్‌తో "Tecno Pop X 5g"..

మారుతున్న కాలానుగుణంగా పలు సంస్థలు రోజుకో స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేస్తున్నాయి. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. తక్కువ బడ్జెట్‌లో హై-ఎండ్ ఫీచర్లను అందించడానికి అనేక కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకువస్తున్నాయి. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు కస్టమర్లను ఆకర్షించేందుకు దిగ్గజ కంపెనీలు సైతం పోటీపడుతున్నారు. Tecno Mobile భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ క్రమంలోనే కొత్త 5G డివైస్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ ఫోన్, కనెక్టివిటీ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో కూడా నిరాటంక కమ్యూనికేషన్ అందించాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా Tecno Pop X 5Gను అధికారికంగా విడుదల చేసింది. బడ్జెట్ ధరలోనే పెద్ద బ్యాటరీ, స్మార్ట్ ఫీచర్లు, ప్రత్యేక కమ్యూనికేషన్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫోన్, రోజువారీ వినియోగదారులకు మంచి ఎంపికగా నిలుస్తోంది. ప్రత్యేకంగా నెట్‌వర్క్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుందని టెక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

tecno-pop-x-5g-price-and-specifications-full-details-along-with-offers-and-availability-in-india

Tecno Pop X 5G ఫీచర్స్..

డిస్‌ప్లే..

ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్, వీడియో వీయింగ్ మరింత స్మూత్‌గా అనిపిస్తుంది. పెద్ద స్క్రీన్ కారణంగా వినియోగదారులకు మంచి విజువల్ అనుభవం లభిస్తుంది.

పనితీరు (Performance)..

పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డిమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్‌ను సులభంగా నిర్వహించగలదు. 4GB మరియు 6GB RAM వేరియంట్లతో పాటు 128GB స్టోరేజ్ అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు.

బ్యాటరీ & ఛార్జింగ్..

6500mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు వినియోగించుకోవచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే బ్యాటరీ రీచార్జ్ అవుతుంది.

డిజైన్ & బిల్డ్ క్వాలిటీ..

8.18mm సన్నని డిజైన్‌తో పాటు ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం కెమెరా మాడ్యూల్‌తో ఇది స్టైలిష్‌గా కనిపిస్తుంది. IP64 రేటింగ్‌తో ధూళి, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది.

ప్రత్యేక కనెక్టివిటీ ఫీచర్..

ఈ ఫోన్‌లో "ఫ్రీలింక్ కమ్యూనికేషన్" అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా సమీపంలోని ఇతర డివైజ్‌లతో కనెక్ట్ అవ్వవచ్చు. దాదాపు 1.5 కిలోమీటర్ల పరిధిలో కాల్స్, మెసేజ్‌లు, ఫైల్ షేరింగ్ చేయగలగడం దీనిని ప్రత్యేకంగా నిలబెడుతోంది.

సాఫ్ట్‌వేర్ & AI ఫీచర్లు..

ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16పై ఈ ఫోన్ పనిచేస్తుంది. AI నాయిస్ క్యాన్సిలేషన్, AI రైటింగ్ అసిస్టెంట్, AI ఎరేసర్ 2.0, AI ఇమేజ్ ఎక్స్‌టెండర్ వంటి ఆధునిక ఫీచర్లు యూజర్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి.

కెమెరా..

ఫోటోగ్రఫీ కోసం 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా అందించారు. రోజువారీ ఫోటోలు, వీడియో కాల్స్, సోషల్ మీడియా వినియోగానికి ఇది సరిపోతుంది.

ధర & అందుబాటు..

4GB + 128GB వేరియంట్ ధర ₹15,999 కాగా, 6GB + 128GB వేరియంట్ ₹17,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 24 నుంచి అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+