కొత్త పోస్టులు, అమరావతిలో ట్విన్ టవర్స్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు...!!
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త పోస్టులకు ఆమోదం తో పాటుగా ప్రమోషన్ల పైన ఆమోద ముద్ర వేసింది. ఢిల్లీలో ఏపీ భవన్ ను కొత్తగా నిర్మించాలని డిసైడ్ అయింది. అదే విధంగా అమరావతిలో కొత్తగా చేపట్టే నిర్మాణాల పై సీఆర్డీఏ ప్రతిపాదనల పైన చర్చించిన రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా అధికారిక అజెండా తరువాత పలు కీలక అంశాల పైన సీఎం చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేసారు.
ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. హోమ్ శాఖలో 23 ఏళ్లుగా పని చేస్తున్న SPF 385 కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పించారు. కాగా.. న్యాయ వ్యవస్థలో 23 పోస్టులు క్రియేట్ చేస్తూ నిర్ణయించారు. పంచాయితీ రాజ్.. రూరల్ డెవలప్ మెంట్ లో కొత్తగా 20 పోస్టులకు ఆమోదం లభించింది. మార్కిఫైడ్ రూ. 1800 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతి ఇస్తూ నిర్ణయించారు. న్యూ ఢిల్లీ లో 11.536 ఎకరాల విస్తీర్ణం లో నూతన ఏపీ భవన్ నిర్మాణం కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.. 124.50 తో నూతన ఏపీ భవన్ నిర్మాణం చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నూతన ఏపీ భవన్ నిర్మాణం బాధ్యతలు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ కు నిర్మాణ బాధ్యతలు అప్పగించేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ అవసరాలు,కల్చర్ కు అనుగుణంగా భవన డిజైన్ ఉండేలా చూడాలని సీఎం సూచించారు.

అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు
కృష్ణా నది కరకట్ట వైండింగ్ కాంక్రీట్ నుంచి మట్టి కట్ట ను రూ 443 కోట్లతో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 11 కిలోమీటర్ల కరకట్ట వైండింగ్ కు అనుమతి ఇచ్చారు. అమరావతి క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి రూ.1208.41 కోట్లు వ్యయం చేసేందుకు అమోదం
ఆమోదం తెలిపారు. అమరావతి సచివాలయ, జీఏడీ, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో ఫాసేడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులు చేపట్టేందుకు గానూ రూ.2540 కోట్ల వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ శాసనసభ భవనంలో వివిధ సివిల్ స్ట్రక్చర్ పనులకు గానూ రూ.798 కోట్లను వ్యయం చేసేందుకు అంగీకారం లభించింది. ఎల్పీఎస్ జోన్ 11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల లాంటి మౌలిక సదుపాయాలను చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. రాజధానిలో 220 కేవీ లైన్స్ రీరూటింగ్ చేసేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.
2వ దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్ మంజూరు కోసం నిబంధనల్లో మార్పు చేసేందుకు అమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications