MS Dhoni: సీఎస్కే కీలక మ్యాచ్ లో ధోనీ రిటర్న్ ? అశ్విన్ సంకేతం..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) లేకుండానే ఆడేస్తోంది. ఒకప్పుడు ధోనీ లేకుండా చెన్నై టీమ్ నే ఊహించుకోలేని పరిస్ధితి నుంచి ఇప్పుడు అదే మహీ లేకపోయినా తప్పనిసరి పరిస్ధితుల్లో సీఎస్కే ఆడుతోంది. దీంతో సగటు అభిమానిలోనూ ఆ అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ధోనీని కనీసం చివరి దశ మ్యాచ్ లు అయినా ఆడించేందుకు ఫ్రాంచైజీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

MS Dhoni: ముంబై మ్యాచ్ లో ధోనీ ఆడతాడా? సీఎస్కే క్లారిటీ...!
MS Dhoni: ముంబై మ్యాచ్ లో ధోనీ ఆడతాడా? సీఎస్కే క్లారిటీ...!

ఎల్లుండి సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్న తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వికెట్ కీపర్-బ్యాటర్ ధోనీ.. ఎట్టకేలకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పునరాగమనం చేయవచ్చని భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. ప్రీ-సీజన్ శిక్షణ సమయంలో పిక్కకు గాయం కావడంతో ఈ సీజన్‌లో చెన్నై ఆడిన 12 మ్యాచ్‌లలో ఒక్కదానిలో కూడా ఆడని ధోనీ.. నిన్న రాత్రి లక్నో మ్యాచ్ కూడా ఆడలేదు. లక్నోలో జట్టుతో చేరడానికి అతని ప్రయాణ ఏర్పాట్లు చేసినా..ధోనీ మాత్రం చివరికి చెన్నైలోనే ఉండిపోయాడు.

MS Dhoni set for CSK return vs SunRisers in Chennai Ex-teammate drops big hint
MS Dhoni: సీఎస్కేకు ధోనీ బిగ్ షాక్..! గుజరాత్ మ్యాచ్ ఎందుకు ఆడలేదంటే ?
MS Dhoni: సీఎస్కేకు ధోనీ బిగ్ షాక్..! గుజరాత్ మ్యాచ్ ఎందుకు ఆడలేదంటే ?

అయితే తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్.. ధోనీ శారీరక పరిస్థితిపై సానూకూల వ్యాఖ్యలు చేశాడు. సోమవారం చేపాక్‌లో జరిగే మ్యాచ్‌లో అతను తుది జట్టులోకి తిరిగి రావడం ఖాయమని తెలిపాడు. ఇప్పటికీ, ఒక నాణ్యమైన పేస్ హిట్టర్ గురించి మాట్లాడితే, అది ధోనీయే అని తాను అనుకుంటున్నాని అశ్విన్ పేర్కొన్నాడు. అప్పుడప్పుడు ఇన్నింగ్స్ చివర్లో ఊపు కోల్పోయిన మిడిల్ ఆర్డర్‌కు ధోనీకి ఉన్న శాశ్వత విలువ అలాంటిదన్నాడు.చూద్దాం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడేందుకు మంచి అవకాశం ఉందని తనకు అనిపిస్తోందన్నాడు. తాను విన్నంత వరకు ధోనీ.. గత రెండు మూడు మ్యాచ్‌లకు బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడని అశ్విన్ తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+