Gautam Adani:అదానీ ‘సేవా’ యజ్ఞం.. గ్రామీణ కంటి వైద్య నెట్‌వర్క్‌కు శ్రీకారం!

ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఆదివారం బిహార్‌లో పర్యటించనున్నారు. ఉత్తర, మధ్య భారతదేశంలోని వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో.. ఒక భారీ గ్రామీణ కంటి వైద్య (విజన్ కేర్) ప్రాజెక్టు భూమి పూజ (శంకుస్థాపన) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, దీనిని ప్రారంభించనున్నారు.పాట్నాకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మస్తీచక్ గ్రామంలో ఈ కార్యక్రమం జరగనుంది. అదానీ ఫౌండేషన్, అఖండ్ జ్యోతి ఐ హాస్పిటల్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌గా..
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కంటి వైద్యం, ఉచిత ఆరోగ్య శిబిరాలు, మరియు వైద్య రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ (స్కిల్లింగ్) అందించేలా ఒక సమగ్రమైన వ్యవస్థను ఇక్కడ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, మస్తీచక్ కేంద్రంగా ఏర్పడే ఈ నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ కంటి వైద్య కేంద్రాలలో ఒకటిగా నిలవనుంది. దీని ద్వారా హిందీ హార్ట్‌ల్యాండ్ (ఉత్తర భారత రాష్ట్రాల) పరిధిలోని కోట్ల మంది పేద ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరనుంది.

gautam-adani-to-lead-landmark-seva-initiative-for-rural-vision-care-in-bihar

"సేవయే పరమావధి" - గౌతమ్ అదానీ ఫిలాసఫీ
"సేవయే పరమావధి" (Seva Hi Saadhna Hai) అనే గౌతమ్ అదానీ వ్యక్తిగత ఆలోచన ఆధారంగానే అదానీ గ్రూప్ ఈ సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరిస్తోంది. ఇటీవల కాలంలో అదానీ కుటుంబం సామాజిక సేవల కోసం భారీ విరాళాలు ప్రకటించింది:

  • 2022లో: గౌతమ్ అదానీ 60వ పుట్టినరోజు సందర్భంగా విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి కోసం రూ. 60,000 కోట్లు కేటాయించారు.
  • గత ఏడాది: జీత్ అదానీ వివాహ వేడుకల సందర్భంగా ఇవే రంగాల కోసం అదనంగా మరో రూ. 10,000 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.

ఇవే కాకుండా, 2025లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా సందర్భంగా సుమారు 50 లక్షల మంది భక్తులకు అదానీ గ్రూప్ ఉచిత సేవలు అందించింది. ఒడిశా జగన్నాథ రథయాత్రలోనూ ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పించింది.

అఖండ్ జ్యోతి ఐ హాస్పిటల్ ప్రస్థానం
2005లో బిహార్‌లోని ఒక చిన్న గ్రామంలో కేవలం 30 పడకల ఆసుపత్రిగా ప్రారంభమైన 'అఖండ్ జ్యోతి ఐ హాస్పిటల్'.. నేడు దేశంలోనే అగ్రగామి కంటి వైద్య సంస్థగా ఎదిగింది. ఇప్పటివరకు ఈ సంస్థ ద్వారా 14 లక్షలకు పైగా ఉచిత కంటి ఆపరేషన్లు, లక్షలాది మందికి కంటి పరీక్షలు విజయవంతంగా జరిగాయి.

సరికొత్త మైలురాయి
2024లో ప్రారంభమైన అదానీ ఫౌండేషన్ 'విజన్ కేర్ ప్రోగ్రామ్' ఇప్పటికే 11 రాష్ట్రాల్లో 1.93 లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు చేసి, 59,000 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసింది. ఇప్పుడు బిహార్‌లో ప్రారంభించబోయే సరికొత్త ప్రాజెక్ట్ ఈ సేవా కార్యక్రమాలను మరో స్థాయికి తీసుకెళ్లనుంది. ఈ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య రంగ నిపుణులు, విధానకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+