వేసవి సెలవుల ప్రారంభం వేళ బిగ్ అలర్ట్, తాజా ఆదేశాలు..!!

వేసవి సెలవులు వచ్చేసాయి. ఈ రోజుతో ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు (శుక్రవారం) నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. 12న బడులు తెరుచుకుంటాయి. ఈలోగా టీచర్ల బదిలీలు జరుగు తాయి. అనంతరం టీచర్లకు మారిన సిలబ్‌సపై జూన్‌ మొదటి వారంలో శిక్షణ ఇస్తారు. ఇదే సమయంలో అన్ని విద్యా సంస్థలకు వేసవి సెలవుల వేళ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు రేపట్నుంచి (శుక్రవారం) వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు తెలంగాణ, ఏపీలోని పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. తిరిగి జూన్‌ 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అదే రోజు నుంచి 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. కడమిక్‌ కేలండర్‌ ప్రకారం ఈ ఏడాది వేసవి సెలవులను ప్రకటించింది. ఈ క్రమంలో విద్యార్థుల భద్రతపై విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పది ఫలితాల పైన తుది కసరత్తు జరుగుతోంది. మే తొలి వారంలో పది ఫలితాలు వెల్లడి కానున్నాయి. అదే విధంగా వేసవి సెలవుల ప్రారంభం వేళ ప్రభుత్వం జిల్లాల విద్యా శాఖ అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. జూన్‌ 1 నుంచి ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుతాయి.

ap-govt-latest-guide-lines-for-all-schools-in-the-state-ahead-summer-vacation-begin-here-the-detail

ఏపీ ప్రభుత్వం తాాజా మార్గదర్శకాలు

ఇక.. పాఠశాలలకు జూన్ 12 నుంచి తిరిగి తరగతులు ప్రారంభం కానున్నాయి. కాగా.. ఈ సారి వేసవి సెలవుల్లో విద్యార్ధుల దినచర్యపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సముద్రం, నదులు, సరస్సులు, చెరువులు, కుంటల వద్దకు విద్యార్థులు స్నానానికి వెళ్లని వ్వవద్దని అధికారులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వేసవి తాపం ఎక్కువగా ఉన్నందున, బయట ఆడుకునే సమయంలో విద్యార్థులు ఎక్కువగా నీళ్లు తాగేలా చూడాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. టీవీలు, సెల్‌ఫోన్ల ముందు ఎక్కువ సమయం గడపకుండా వారిని నియంత్రించాలని సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశా లు ఇచ్చింది. అన్ని స్కూళ్లల్లో ఈ కౌన్సిలింగ్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. తగినంత నీరు తాగాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని విద్యాశాఖ సూచించింది. సెలవులు ప్రారంభం అయ్యేలోపు విద్యార్థుల కౌన్సెలింగ్ సెషన్‌లన్నీ పూర్తి చేయాలని నిర్దేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+