కరుప్పు(వీరభద్రుడు) ఎర్లీ రివ్యూ.. సూర్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్!
Karuppu Movie Review: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ జంటగా నటించిన మోస్ట్ అవేటడ్ యాక్షన్ డ్రామా 'కరుప్పు'. మే 14, 2026న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఉదయం, మధ్యాహ్నం షోలు రద్దు కావడంతో అభిమానుల్లో కాస్త గందరగోళం నెలకొంది. అయితే దర్శకుడు ఆర్జే బాలాజీ సాయంత్రం 6 గంటల నుంచి షోలు ప్రారంభమవుతాయని హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
స్టోరీ ఇదే..!
ఈ సినిమాలో సూర్య 'శరవణన్' అనే లాయర్ పాత్రలో నటించారు. అన్యాయానికి గురైన అణగారిన వర్గాల కోసం పోరాడే క్రమంలో ఓ దైవ శక్తి ఆయనలోకి ప్రవేశించిన తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా చూపించారు. సూర్య నటన గురించి నెటిజన్లు స్పందిస్తూ.. ఇది ఆయన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని కొనియాడుతున్నారు. లాయర్‌గా భావోద్వేగాలను పండించడమే కాకుండా మాస్ అవతార్‌లో సూర్య తన విశ్వరూపం చూపించారని రివ్యూలు వస్తున్నాయి.

సినిమా నిర్మాణం గురించి ఇటీవల హీరో సూర్య మాట్లాడుతూ.. ఫస్టాఫ్ అంతా ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా ఉంటుందని.. సెకండాఫ్ మాత్రం పూర్తి స్థాయిలో మాస్ మసాలా, హాస్యం, థియేట్రికల్ సెలబ్రేషన్‌లా ఉంటుందని వెల్లడించాడు. నెటిజన్ల రివ్యూలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్, బీజీఎమ్, కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నాయని, సాయి అభ్యంకర్ అందించిన సంగీతం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అని ప్రేక్షకులు చెప్తున్నారు.
మరోవైపు ఈ చిత్రానికి 4.5/5 రేటింగ్ ఇస్తూ కొందరు అభిమానులు 'కరుప్పు'ను ప్యూర్ బ్లాక్‌బస్టర్‌గా అభివర్ణిస్తున్నారు. సూర్య స్క్రీన్ ప్రెజెన్స్, స్వ్యాగ్, డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయని, ఇదొక గొప్ప అనుభూతినిచ్చే సినిమా అని సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. నిర్మాత ఎస్ఆర్ ప్రభు కూడా ఈ చిత్రం ఫుల్ ఎనర్జీతో కూడిన ఎంటర్‌టైనర్ అని, పండగ వాతావరణాన్ని తలపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి, ఆరంభంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications