పవన్ సూచనల మేరకు హీరో నాని బిగ్ స్టెప్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టింది. వర్షాకాలం సమీపిస్తోన్న నేపథ్యంలో గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణాన్ని నెలకొల్పడం, తద్వారా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటోంది. పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా స్వచ్ఛ రథాలను ప్రారంభించింది.

పవన్ కల్యాణ్ ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలెబ్రెటీల సహకారాన్ని తీసుకుంటోంది.

Deputy CM Pawan Kalyan Hails Nani s Quick Cooperation to Promote Swachcha Rathas in Andhra Pradesh

ఈ క్రమంలో ప్రముఖ నటుడు నాని.. ముందుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛరథాలపై తన వంతు సహాయ సహకారాలు అందించారు. ఓ వీడియోను విడుదల చేశారు. జల సిరులు, పారిశుద్ధ్య విరులు అనే పోస్టర్ ను ఆవిష్కరించారు. తడిచెత్త, పొడిచెత్తను వేరు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. పారిశుద్ధ్యంపై గ్రామీణ స్థాయిల్లో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నాని అన్నారు. ఈ చెత్త నుంచి సంపదను సృష్టించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ వీడియోను విడుదల చేసిన నానికి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ స్వచ్చరథాలు ఏప్రిల్ లో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ. 3.32 కోట్ల విలువగల నిత్యవసరాలను ప్రజలకి అందించాయని అన్నారు. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మరింత మంది సెలెబ్రెటీలు ముందుకు రావాలని కోరారు.

భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఈ స్వచ్ఛరథాలు పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు, స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్, స్వచ్చ ఆంధ్ర లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛ రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+