చెల్లి "ఖుషి"ని అనుకుంటే అక్క "జాన్వీ"ని ఓకే చేశాం - పెద్ది డైరెక్టర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీని జూన్ 4వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.
మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు హీరోయిన్ ఎంపికపై ఆసక్తికర విషయం వెల్లడించారు. రామ్‌చరణ్‌కు జోడీగా మొదట జాన్వీ కపూర్ సోదరి ఖుషీని అనుకున్నానని.. కానీ ఆమెను కలిసినప్పుడు చిన్నపిల్లలా కనిపించడంతో పాత్రకు సరిపోదని అనిపించిందన్నారు. దీంతో జాన్వీని తీసుకోవాల్సి వచ్చిందన్నారు. రిజెక్ట్ చేసినందుకు ఖుషీ ఫీలయ్యారా? అని జాన్వీని అడిగితే అయ్యో అలాంటిదేమీ లేదన్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముందుగా వచ్చిన వీడియోలో చరణ్ ఫుల్ గా జుట్టు, గడ్డంతో రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. చెర్రీ కొట్టే ఐకానిక్ క్రికెట్ షాక్ కూడా ఫుల్ ట్రెండింగ్ అయ్యింది. అలానే చరణ్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి పహిల్వాన్ గ్లింప్స్ (pehelwan glimpse )అంటూ ఒక వీడియోని విడుదల చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది.
తాజా సమాచారం ప్రకారం, జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ వేడుకకు భారత మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని చూస్తున్నట్టు గట్టిగా వినిపిస్తోంది. ధోనీ స్వస్థలం రాంచీ కావడం, అలాగే సినిమా క్రీడా నేపథ్యంలో ఉండటంతో ఆయన రాక సినిమాకు భారీ హైప్ తీసుకొస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ప్రస్తుతానికి ధోనీతో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఇంకా ఏదీ అధికారికంగా ఖరారు కాలేదని తెలుస్తోంది. ఒకవేళ ధోనీ ఈ ఈవెంట్‌కు హాజరైతే మాత్రం, నార్త్ ఇండియా మార్కెట్‌లో 'పెద్ది' సినిమాకు తిరుగులేని ప్రచారం లభిస్తుందని చెప్పొచ్చు. రామ్ చరణ్ మాస్ ఇమేజ్, ధోనీ క్రేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications