కాకినాడ, అనకాపల్లికి పండగే..! కొత్తగా వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లు..!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాకినాడ, అనకాపల్లి, చర్లపల్లి, మైసూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఏపీలోని కాకినాడ, అనకాపల్లి నుంచి మైసూరు, చర్లపల్లి స్టేషన్లకు రెండు కొత్త రైళ్లను (New trains) నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ రెండు మార్గాల్లో కొత్తగా నడపబోతున్న రైళ్ల వివరాలను విడుదల చేసింది. అయితే ఈ రెండూ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లే కావడం విశేషం. ఈ రైళ్లు ఎప్పటి నుంచి రాకపోకలు సాగిస్తాయో అధికారులు ప్రకటించారు.
ముందుగా కాకినాడ-మైసూరు (Kakinada-mysuru) మార్గంలో కొత్తగా బై-వీక్లీ ఎక్స్ ప్రెస్ (17289/17290) ను ప్రవేశపెట్టబోతున్నారు. కాకినాడ నుంచి మైసూరుకు రైలు నంబర్ 17289 ప్రతీ సోమవారం, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మే 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు కాకినాడలో ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు మైసూరు చేరుకుంటుంది.

🚆 New Connectivity Alert!
— South Central Railway (@SCRailwayIndia) April 24, 2026
Introducing the #Kakinada Town – #Mysuru – Kakinada Town Bi-Weekly Express (Train Nos. 17289/17290), enhancing seamless travel across Andhra Pradesh, Telangana, and Karnataka.
Plan your journey and experience smoother travel with Indian Railways! 🇮🇳… pic.twitter.com/IwwRKHjR9d
అలాగే మైసూర్ నుంచి కాకినాడకు రైలు నంబర్ 17290 ప్రతీ మంగళవారం, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. మే2 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు మైసూరులో సాయంత్రం 5.05కు బయలుదేరి కాకినాడకు మరుసటి రోజు రాత్రి 11.30కు చేరుకుంటుంది. ఈ రైలుకు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్ లో స్టాప్ లు ఇచ్చారు.

🚆 New Weekly Connectivity Alert!
— South Central Railway (@SCRailwayIndia) April 24, 2026
South Central Railway introduces the #Charlapalli – #Anakapalle – Charlapalli Weekly Express (Train Nos. 17045/17046), enhancing travel convenience across Telangana and Andhra Pradesh.
This new service improves accessibility and strengthens… pic.twitter.com/7Y31H9X5Ln
అలాగే చర్లపల్లి-అనకాపల్లి మార్గంలో వీక్లీ ఎక్స్ ప్రెస్ (17045/17046) రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మే 9 నుంచి ప్రతీ శనివారం చర్లపల్లి-అనకాపల్లి వీక్లీ ఎక్స్ ప్రెస్ 17045, మే 3 నుంచి ప్రతీ ఆదివారం అనకాపల్లి-చర్లపల్లి వీక్లీ ఎక్స్ ప్రెస్ 17046 అందుబాటులోకి వస్తాయి. చర్లపల్లి నుంచి శనివారం రాత్రి 8.05కు బయలుదేరే రైలు ఆదివారం ఉదయం 9.25కు అనకాపల్లి చేరుకుంటుంది. అలాగే అనకాపల్లి నుంచి ఆదివారం సాయంత్రం 5.35కు బయలుదేరే రైలు చర్లపల్లికి సోమవారం ఉదయం 7.20కు చేరుకుంటుంది. ఈ రైలుకు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలిలో హాల్ట్ లు ఇచ్చారు.














Click it and Unblock the Notifications