టీడీపీ రాజకీయ వ్యూహకర్తగా సునీల్?: టీఆర్ఎస్ నుంచి వలస?: చంద్రబాబు వ్యూహాలపై డౌట్స్
అమరావతి: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉంది. ఎన్నికల మూడ్‌లోకి వెళ్లడానికి ఇంకా చాలినంత సమయం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ఎన్నికల కోసం సన్నద్ధం కావాలనే విషయంపై ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించట్లేదు గానీ- రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో మాత్రం టచ్‌లో ఉన్నారనే వార్తలు తరచూ వినిపిస్తోన్నాయి. ప్రశాంత్ కిశోర్‌ను మరోసారి వ్యూహకర్తగా అపాయింట్ చేసుకోవడం దాదాపు ఖాయమైందనేది వాటి సారంశం.

వైసీపీకి భిన్నంగా టీడీపీ..
తెలుగుదేశం పార్టీ పరిస్థితి.. దీనికి పూర్తి భిన్నంగా ఉంటోంది. అధికారాన్ని కోల్పోయిన మరుసటి రోజు నుంచే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతూ వస్తోంది. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ మొదట్లో ఆరోపణలను గుప్పిస్తూ వచ్చిన టీడీపీ.. ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆలయాలపై దాడుల విషయంపై విస్తృతంగా ప్రచారం చేసింది. అవేవీ ఫలించలేదనడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం.

రోజూ వార్తల్లో నిలవడం అత్యవసరం..
రెండున్నర సంవత్సరాల తరువాత వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది. రోజూ వార్తల్లో నిలవడానికి ప్రాధాన్యత ఇస్తోంది టీడీపీ. ఏదో ఒక అంశం మీద వార్తల్లో నిలవడానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా అధికార పార్టీ నాయకులపై విమర్శలను సంధించడానికి కారణాలను తెర మీదికి తీసుకొస్తోంది. సోషల్ మీడియాను ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంది.

సునీల్ కానుగోలుతో.. కాంట్రాక్ట్?
ఈ పరిణామాల మధ్య- టీడీపీ ఓ కొత్త రాజకీయ వ్యూహకర్తను నియమించుకుందనే ప్రచారం సాగుతోంది. ఆయనే- సునీల్ కానుగోలు. ప్రశాంత్ కిశోర్ శిష్యుడని, ఆయనకు చెందిన ఐప్యాక్ టీమ్‌లో కీలక సభ్యుడనీ చెబుతున్నారు. ఇదివరకు తెలంగాణ రాష్ట్ర సమితి వద్ద సునీల్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇదివరకు రాబిన్ శర్మను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నప్పటికీ.. 2019 నాటి ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం వల్ల సునీల్ కానుగోలు వైపు టీడీపీ మొగ్గు చూపిందని అంటున్నారు.

ప్రశాంత్ కిశోర్‌తో టీఆర్ఎస్
టీఆర్ఎస్.. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకుందంటూ వార్తలు వచ్చాయి. ఇదివరకే ఒకట్రెండు సార్లు ఆయన.. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిశారని చెబుతున్నారు. మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్ సహకారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని కేసీఆర్, కేటీఆర్ బలంగా విశ్వసిస్తున్న నేపథ్యంలో- ఐప్యాక్‌తో ఒప్పందం సైతం ఓకే అయినట్లు తెలుస్తోంది.

ఐప్యాక్‌తో సమగ్ర ఒప్పందం..
తాజాగా ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్‌తో టీఆర్ఎస్ ఓ ఒప్పందాన్ని కుదర్చుకుందని తెలుస్తోంది. 2023 చివరన జరిగే అసెంబ్లీ, 2024లో ఎదుర్కొనబోయే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి అవసరమైన సూచనలు, సలహాలు, వ్యూహాలను రూపొందించాల్సిన బాధ్యతను టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం ప్రశాంత్ కిశోర్ చేతికి అప్పగించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీనికి అవసరమైన ఒప్పందాలను త్వరలోనే కుదుర్చుకునే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నా
Recommended Video

టీఆర్ఎస్ నుంచి టీడీపీకి..
సునీల్ కానుగోలుతో టీఆర్ఎస్ కాంట్రాక్ట్ ముగిసిన నేపథ్యంలో- టీడీపీ ఆయనను హైర్ చేసుకుందనే ప్రచారం ఉంది. 2016లో డీఎంకే కోసం సునీల్ పనిచేశారని, జయలలిత ప్రభంజనం ముందు అన్నాడీఎంకే అలవోకగా విజయం సాధించడం వల్ల ఆయన వ్యూహాలు పెద్దగా వెలుగులోకి రాలేదని చెబుతున్నారు. ఆ తరువాత ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం సునీల్ బీజేపీ కోసం పని చేసి, ఆశించిన ఫలితాలను అందుకున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications