బండి సంజయ్ రాజీనామా అక్కర్లేదు- మల్లు రవి బిగ్ షాక్ ..!
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అయిన రేవంత్ రెడ్డిని హైదరాబాద్ వచ్చిన మోడీ.. తమ పార్టీలోకి ఆహ్వానించగా.. మరోవైపు కొడుకు బండి భగీరథ్ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పోక్సో కేసు విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)పై ప్రత్యర్థి పార్టీలన్నీ దుమ్మెత్తిపోస్టుండగా.. అందులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి (Mallu Ravi) మాత్రం ఆయనకు అండగా నిలిచారు.
కొడుకు బండి భగీరథ్ తప్పు చేశాడని పోలీసులు తేల్చినా నైతిక బాధ్య వహిస్తూ కేంద్రమంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్లు చేస్తున్న తరుణంలో.. అదే పార్టీ ఎంపీ మల్లు రవి మాత్రం ఈ వాదనతో విభేధించారు. పిల్లలన్నాక తప్పులు చేయడం సహజమని తేల్చేశారు. అంతమాత్రానికే మంత్రి పదవికి రాజీనామా చేయమనడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అభిప్రాయపడ్డారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడిని దాచిపెట్టకుండా చట్టానికి లొంగిపోయేలా చేసి బాధ్యతాయుతంగా వ్యవహరించారని మల్లు రవి కితాబిచ్చారు. రాజకీయాలకతీతంగా బండి సంజయ్ వైఖరిని సమర్థిస్తూ మల్లు రవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై రాజకీయ వర్గాల్లో పలు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో మల్లు రవి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications