పిల్లల్ని కనేయా చేయడమెలా? చంద్రబాబుకు సాయిరెడ్డి సలహా..!

ఏపీలో పిల్లల జనాభా తగ్గిపోతుందని, ఎక్కువ మంది పిల్లల్ని కంటే డబ్బులిస్తామంటూ సీఎం చంద్రబాబు ఆశ పెడుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్ని కంటే డబ్బులిస్తారు సరే.. వాళ్లను పెంచేందుకు డబ్బులు ఎవరిస్తారంటూ పంచ్ లు పడుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా పిల్లల్ని కనండి చాలు అంటూ ప్రచారం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కొందరు చంద్రబాబు పిల్లల పాలసీని మెరుగుపర్చేందుకు పలు సూచనలు కూడా చేస్తున్నారు.

3 రూపాయలకే గగ్గోలా ? పెట్రోల్ ధర పెంపుపై సాయిరెడ్డి షాకింగ్..!
3 రూపాయలకే గగ్గోలా ? పెట్రోల్ ధర పెంపుపై సాయిరెడ్డి షాకింగ్..!

ఇదే క్రమంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (VijayaSai Reddy) ఇవాళ చంద్రబాబు (Chandrababu) కు ఓ కీలక సూచన చేశారు. రాష్ట్రంలో జననాల రేటు పెంచేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై స్పందిస్తూ విజయసాయిరెడ్డి ఎక్స్ లో ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. చంద్రబాబు పిల్లల ఆఫర్లను తప్పుబట్టారు. దక్షిణ భారత రాష్ట్రాలు తగ్గుతున్న జననాల రేటును పెంచాలనుకుంటే, దాని మూల కారణమైన పిల్లల పెంపకానికి పెరుగుతున్న ఖర్చుపై దృష్టి సారించాలని ఆయన కోరారు.

Vijayasai Reddy vs Chandrababu on Population Policy Fix Cost of Living to Raise Birth Rates Not Cash Incentives
బాబు గారూ మీకు అర్థమవుతోందా..! వైసీపీ డిమాండ్ తో సాయిరెడ్డి పంచ్..!
బాబు గారూ మీకు అర్థమవుతోందా..! వైసీపీ డిమాండ్ తో సాయిరెడ్డి పంచ్..!

నాణ్యమైన విద్య, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ, సరసమైన గృహవసతి, ఆర్థిక స్థిరత్వం వంటివి కుటుంబాలను ఎక్కువ మంది పిల్లలను కనడానికి సహజంగానే ప్రోత్సహిస్తాయన్నారు. ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం సరైన మార్గం కాకపోవచ్చు అంటూ చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సూచించారు. తద్వారా డబ్బులిచ్చి పిల్లల్ని కనేలా ప్రోత్సహించడం కంటే తాను చెప్పిన మార్గం అనుసరిస్తే సహజ విధానంలో ప్రజలు పిల్లల్ని కంటారని, అప్పుడు ప్రభుత్వం పెద్దగా కష్టాపడాల్సిన అవసరం ఉండదని సాయిరెడ్డి పరోక్షంగా చెప్పేశారు. దీనిపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+