రామ్‌చరణ్ చేయకుండా ఉండాల్సిన సినిమాలు ఇవే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. 'చిరుత'గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, 'మగధీర'తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి, 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. తన కెరీర్ ఆరంభం నుండి మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ భారీ కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చారు చరణ్. మధ్యలో 'ఆరెంజ్' లాంటి లవ్ స్టోరీతో కొత్త ప్రయోగం చేసినా, అప్పట్లో అది వర్కవుట్ కాలేదు. రామ్ చరణ్ కెరీర్‌లో 'చేసి ఉండాల్సింది కాదు' అనిపించే 5 సినిమాలు ఇక్కడ ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
తుఫాన్
అమితాబ్ బచ్చన్ క్లాసిక్ మూవీ 'జంజీర్' రీమేక్‌తో రామ్ చరణ్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం చరణ్ కెరీర్‌లోనే అత్యంత చెత్త సినిమాగా మిగిలిపోయింది. వీక్ స్క్రీన్‌ప్లే, సరైన ఎమోషన్స్ లేకపోవడంతో ఈ సినిమా అటు హిందీలో, ఇటు తెలుగులో బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది.

బ్రూస్ లీ
శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జోడీగా వచ్చిన చిత్రం 'బ్రూస్ లీ'. అప్పటికే టాలీవుడ్‌లో రొటీన్ అయిపోయిన ఫక్తు కమర్షియల్ ఫార్మాట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవి క్లైమాక్స్‌లో కాసేపు మెరిసినప్పటికీ.. బలహీనమైన కథ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.
వినయ విధేయ రామ
'రంగస్థలం' లాంటి క్లాసిక్ ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి ప్రేక్షకులు ఎలాంటి నటనను, ఎలాంటి కథలను ఆశిస్తున్నారో అందరికీ అర్థమైంది. కానీ, చరణ్ మాత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' లాంటి అతిగా ఉన్న రొటీన్ మాస్ సినిమాను ఎంచుకున్నారు. లాజిక్స్ లేని యాక్షన్ సీన్స్, బలవంతపు సెంటిమెంట్‌తో ఈ సినిమా మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది.
ఆచార్య
రాజమౌళి విజువల్ వండర్ 'RRR' తో గ్లోబల్ రేంజ్‌కు వెళ్లిన తర్వాత రామ్ చరణ్ చేసిన అతిపెద్ద తప్పు 'ఆచార్య'. నిజానికి ఇది చిరంజీవి సినిమానే అయినప్పటికీ, చరణ్ ఇందులో సిద్ధ అనే కీలక పాత్ర పోషించారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మెగా తండ్రీ కొడుకులను ఒకే స్క్రీన్‌పై చూపిస్తూ భారీ అంచనాలతో వచ్చింది. కానీ, పేలవమైన కథనం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చాపచుట్టేసింది.
గేమ్ ఛేంజర్
భారీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'. RRR తర్వాత చరణ్ నుంచి ఒక పవర్‌ఫుల్ పాన్ ఇండియా సబ్జెక్ట్ ఆశించిన అభిమానులకు ఈ సినిమా విషయంలో నిరాశే ఎదురైంది. ఈ చిత్రానికి రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదని, RRR తర్వాత చరణ్ ఇలాంటి రొటీన్ పొలిటికల్ డ్రామాను ఎంచుకోకుండా ఉండాల్సిందని అప్పట్లో ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన కామెంట్స్ వినిపించాయి.












Click it and Unblock the Notifications