అమరావతి - చెన్నై..బెంగళూరు మధ్య ఇక, ఏపీకి కొత్త రైళ్లు..ప్రాజెక్టులు- రైల్వే మంత్రి..!!

రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ కీలక ప్రకటన చేసారు. ఏపీకి రైల్వే ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. కొత్తగా రానున్న బుల్లెట్ రైళ్ల కేటాయింపులో అమరావతి మీదుగా ప్రయాణం చేసేందుకు నిర్ణయం జరిగిందని చెప్పుకొచ్చారు. ఏపీకి కొత్త ప్రాజెక్టులు.. రైళ్ల కేటాయింపు పైన స్పష్టత ఇచ్చారు. ఏపీలో రైల్వే లైన్లు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకున్నట్లె వెల్లడించారు. కాగా.. బుల్లెట్ రైళ్లను ప్రవేశ పెట్టేందుకు కసరత్తు తీవ్రతరం చేసినట్లు ప్రకటించారు.

ఏపీకి సంబంధించి రైల్వే మంత్రి కీలక అంశాలను వెల్లడించారు. తయారీ రంగంలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని, భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్ తయారీ అత్యంత కీలకమని అశ్విని వైష్ణవ్‌ అన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్‌ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. 2024 నుంచి సెమీకండక్టర్ల తయారీపై కేంద్రం దృష్టి సారించిందని తెలిపారు. గూగుల్‌ వంటి ప్రముఖ సంస్థలు విశాఖపట్నానికి రావడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఇప్పటికే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలకు వీలుగా అన్ని ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. జూన్ 1 నుంచి విశాఖపట్నం రైల్వే జోన్‌ను నోటిఫై చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు.

railway-minister-aswini-vaishaw-bing-accouncement-over-bullet-train-between-amaravati-and-hyderabad

అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు

అమరావతి - హైదరాబాద్‌ మధ్య బుల్లెట్ ట్రైన్‌‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య 70 నిమిషాల్లో, చెన్నై నుంచి అమరావతికి 112 నిమిషాల్లో ప్రయాణం సాధ్యమవుతుందని వివరించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల 08 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చన్నారు. చెన్నై నుంచి కోల్‌కతా మధ్య రైల్వే లైన్లను 4 లేన్లుగా విస్తరించే పనులు చేపడతామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. ఏపీ నుంచి ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు కొత్తగా వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు కోసం వినతి పత్రాలు సమర్పించారు. కాగా.. త్వరలోనే ఏపీకి కొత్తగా వందేభారత్ స్లీపర్ కేటాయింపు పైన నిర్ణయం ఉంటుందనే సంకేతాలు అందుతున్నాయి. అదే విధంగా త్వరలో ప్రారంభం కానున్న ముంబాయి - బెంగళూరు వందేభారత్ స్లీపర్ ఏపీ మీదుగా రూట్ ఖరారు ేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+