మంచు మనోజ్ 'డేవిడ్ రెడ్డి' టీజర్.. పిచ్చెక్కించడం ఖాయం భయ్యా..!!
టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చిన్నతనం నుంచే నటపై ఆసక్తి పెంచుకున్నారు. 'మేజర్ చంద్రకాంత్' సినిమాలో బాలనటుడిగా మంచు మనోజ్ నటించారు. ఆ తర్వాత 'దొంగ దొంగది' సినిమాతో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల భైరవం సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భైరవం సినిమాలో మంచు మనోజ్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మిరాయ్ సినమాలో విలన్ పాత్రలో నటించి మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు.
ఆ తర్వాత 'డేవిడ్ రెడ్డి' అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు మంచు మనోజ్. ఆయన హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా 'డేవిడ్ రెడ్డి' చిత్రాన్ని హనుమరెడ్డి యక్కంటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 1897 నుంచి 1922 మధ్య కాలంలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది.
డేవిడ్ రెడ్డి మూవీ గ్లింప్స్ ఇదివరకే రిలీజైంది. ది స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి అనే పేరుతో ఈ మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే ఈ గ్లింప్స్ ను భారీగా రెస్పాన్స్ వచ్చింది. అయితే మంచు ఫ్యాన్స్ కు మంచు మనోజ్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మంచు మనోజ్ రైల్వే ట్రాక్ మధ్యలో నిలబడి కనిపించారు.

ఈ మూవీ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోందని అర్థం అవుతోంది. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్లపై భరత్ మోతుకూరి, వెంకట్ రెడ్డి నల్లాగంగుల ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా ఉక్రెయిన్ నటి మరియా రియా బోషప్కా కీలక పాత్రలో నటిస్తోంది. ఇక కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ మూవీకి ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.












Click it and Unblock the Notifications