విజయ్, జగన్ మధ్య గొప్ప పోలిక చెప్పిన రోజా.. విజయ్ కోసం ఏమన్నారంటే!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మరోమారు టీవీకే అధినేత విజయ్ పైన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు,. విజయ్ కు జగన్మోహన్ రెడ్డికి మధ్య పోలిక ఉందని పేర్కొన్న రోజా దానిని వివరించారు. నేడు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయం దర్శించుకున్న రోజా గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

జగన్ తో విజయ్ ను పోల్చిన రోజా

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాజకీయ అంశాల పైన రోజా స్పందించారు. తమిళనాడు ఎన్నికలలో విజయ్ జగన్ మార్గంలోనే నడుస్తున్నారని రోజా తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ తో కలిసి ఉన్న ఫోటోలు విజయ్ బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా జగన్ లాంటి నాయకత్వం ఇస్తానని సంకేతాలు ఇచ్చారని, రోజా జగన్ తో విజయ్ ని పోల్చారు.

roja compared vijay with jagan roja said vijay dressing and political style looks like ys jagan

డ్రెస్సింగ్ కూచా సేమ్ టు సేమ్

అంతేకాదు డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో కూడా విజయ్ జగన్ ను ఫాలో అవుతున్నారని మాజీ మంత్రి రోజా చెప్పారు. దుస్తుల ఎంపిక, బహిరంగ సభలో మాట్లాడే తీరు తదితర విషయాలను గమనించినట్లయితే ఇది స్పష్టంగా కనిపిస్తుందని రోజా చెప్పారు . ఏపీలో జగన్ సింగిల్ గా పోటీ చేస్తున్న తీరును అనుసరించిన విజయ్ తమిళనాడులో ఆ విధంగానే విజయం సాధించారని రోజా అన్నారు.

తెలంగాణా వాహనదారులకు పండుగే.. ఇకపై మీ కోసమే సారధి!
తెలంగాణా వాహనదారులకు పండుగే.. ఇకపై మీ కోసమే సారధి!

జగన్ ను విజయ్ అనుసరిస్తారని రోజా వ్యాఖ్యలు

మొత్తానికి విజయ్ వైయస్ జగన్ ను అనుసరిస్తారని, డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో కూడా ఇద్దరు సేమ్ టు సేమ్ అంటూ రోజా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తించింది. తమిళనాడు ఎన్నికల ఫలితాల నుండి రోజా చేస్తున్న వ్యాఖ్యలపై ప్రజల ఫోకస్ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+