జగన్ సన్నిహిత నేతకు బిగిస్తున్న ఉచ్చు, కుమారుడితో సహా - లిస్టులో నెక్స్ట్..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లిక్కర్ కేసు కొత్త మలుపు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు వైసీపీ ముఖ్య నేతల విచారణ.. అరెస్ట్ చేసిన సిట్ తాజాగా మాజీ మంత్రి.. మాజీ ఎంపీగా వ్యవహరించిన ఆయన కుమారుడుకు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ అక్రమ రవాణా కేసులో విచారణకు హాజరు కావాలని సూచించింది. అక్రమాల విచారణలో వారి ప్రమేయం పైన ఆధారాలు సేకరించిన సిట్.. ఇప్పుడు వీరిద్దరి విచారణ సమయంలో తీసుకునే నిర్ణయాల పైన రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో లిక్కర్‌ రవాణా కాంట్రాక్టు, టెండర్లలో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు, ఆయన కుమారుడు సునీల్‌కు సిట్‌ అధికారులు నోటీసులు జారీచేశారు. విజయవాడ కమిషనర్‌ కార్యాలయంలోని సిట్‌ ఆఫీసుకు గురువారం(23న) హాజరు కావాలని ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని నివాసంలో వారు లేకపోవడంతో అధికారులు ఆ ఇంటి గోడకు నోటీసులు అంటించారు.

SIT officials have issued notices to Ex-Minister Karumuri Nageswara Rao amp amp Son in the alleged liquor transport irregularities case

మద్యం రవాణాకు సంబంధించి అవకతవకతలు జరిగినట్లు సిట్‌ కేసు నమోదుచేసింది. కారుమూరి, ఆయన కుమారుడికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. వారిద్దరిపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 468, 471, బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 111, 212, 217, 317, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 7ఏ, 8, 9, 10, 12, 13 (1 ఏ, బీ), 13(2) కింద కేసు నమోదు చేసింది. గోడకు నోటీసులు అంటించిన కాసేపటికే వాటిని ఎవరో చించివేశారు.

సిట్ నోటీసులు.. కీలక నిర్ణయాలు

కాగా, మద్యం రవాణాచేసే కాంట్రాక్టులో రూ.200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు దోచుకున్న వ్యవహారంలో సీఐడీ గత నెలలో కేసు నమోదు చేసింది. ఇదే సమయంలో మద్యం కుంభకోణం కేసులో ఐఏఎస్ మాజీ అధికారి ధనుంజయ రెడ్డి, ఐఆర్‌టీఎస్ అధికారి వాసుదేవ రెడ్డిని ప్రాసిక్యూషన్‌కు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయా విభాగాలకు సిట్ లేఖలు రాసింది. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే వీరిరువురినీ సిట్ అధికారులు అరెస్ట్ చేయగా... ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు.

దీంతో ధనుంజయ్ రెడ్డిని ప్రాసిక్యూషన్ చేసేందుకు డీఓపీటీకి, వాసుదేవ రెడ్డిని ప్రాసిక్యూషన్ చేసేందుకు ఐఆర్‌టీఎస్‌కు లేఖ రాశారు సిట్ అధికారులు. అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్లు కింద న్యాయవిచారణ జరపాలంటే సంబంధిత విభాగాల నుంచి అనుమతి అవసరమని సిట్ ఆఫీసర్స్‌ చెబుతున్నారు. ఇరువురినీ ప్రాసిక్యూషన్ చేసేందుకు ఆయా విభాగాలకు అధికారులు లేఖలను పంపించారు. లిక్కర్ కుంభకోణంలో వాసుదేవరెడ్డి ఏ2 నిందితుడిగా, ధనుంజయ్ రెడ్డి ఏ 31 నిందితుడిగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+