Cockroach Janta Party: పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీ ఫాలోవర్లే ఎక్కువ..?
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) సంచలనం సృష్టిస్తోంది. జెన్ జీ యువతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. పొలిటికల్ సెటైరికల్ అకౌంట్ గా పేరుగాంచింది. దేశ రాజకీయాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది కాక్రోచ్ జనతా పార్టీ.. ఇక ఈ సెటైరికల్ పార్టీ ఏకంగా దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల సామాజిక మాధ్యమ ఖాతాలను సైతం ఇది దాటేస్తోంది. తాజాగా అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను సైతం దాటేసింది. ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో బీజేపీకి 8.8 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. కాక్రోచ్ జనతా పార్టీకి ఏకంగా 13.2 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం విశేషం. దీన్ని బట్టే జెన్ జీ యువత ఈ పార్టీకీ ఏ రేంజ్ లో మద్దతు ఇస్తుందో అర్థం అవుతుంది.
అయితే కాక్రోచ్ జనతా పార్టీకి ఇంత తక్కువ సమయంలో ఇన్ స్టాలో ఇంత భారీ సంఖ్యలో ఫాలోవర్స్ రావడంపై కొందరు నెటిజన్లు విచారణ చేపట్టారు. అయితే ఈ ఖాతాను ఫాలో అవుతున్నవారిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీ దేశాలకు చెందిన ప్రొఫైల్స్ అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు స్క్రీన్ షాట్స్ సాక్ష్యాలతో సహా వాటిని బయటపెట్టారు. కాక్రోచ్ జనతా పార్టీలో ఇతర దేశాల ఐడీలు భారీ సంఖ్యలో ఫాలో కావడం వెనుక పెయిడ్ బాట్స్ లేదా విదేశీ శక్తుల ప్రమేయం ఉండే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇక భారత్ లోని ప్రతిపక్షపార్టీలు, విదేశీ నెట్ వర్క్ లు ఉద్దేశపూర్వకంగానే ఈ పేజీని ప్రొమోట్ చేస్తున్నాయని అధికార బీజేపీ ప్రతిష్టను తగ్గించేందుకు ఈ ఫేక్ ఫాలోవర్స్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలాఉండగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ది రెడ్ మైక్ అనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిజీత్ దిప్కే మాట్లాడుతూ.. తాను భారత్ కు వస్తే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు. దిల్లీ పోలీస్ కాన్వాయ్ తనను నేరుగా తీహార్ జైలుకు తీసుకెళ్తుందని భావిస్తున్నానని అన్నారు. అలాగే ఫాలోవర్స్ పై మాట్లాడుతూ.. ఫాలోవర్స్ పెరగడం వల్ల తాను సంతోషపడటం లేదని అన్నారు. దానివల్ల ఏం మారుతుంది..? అసలైన సమస్యలు నిరుద్యోగం లాంటివి అలాగే ఉన్నాయి కదా అని పేర్కొన్నారు. ఇక కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాను నిలిపివేస్తున్నట్లు మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ప్రకటించింది. దీనిపై స్పందించిన అభిజీత్ దిప్కే.. మేం ముందే ఊహించినట్లుగానే ఖాతాను బ్లాక్ చేశారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications