మెట్రోలో ఫోటో షూట్స్.. సెలబ్రేషన్ ఆన్ వీల్స్.. ఎక్కడంటే!
దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మెట్రో రైళ్ళు నష్టాలలో నడుస్తున్నాయి. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల నష్టాల్లో నడుస్తున్న మెట్రోలను నిర్వహించటం కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మెట్రో లాభాల బాట పట్టేలా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. . 'సెలబ్రేషన్ ఆన్ వీల్స్' పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించారు.
ప్రైవేట్ ఈవెంట్‌ల కోసం మెట్రో రైళ్ళు అద్దెకు
మెట్రో కోచ్‌లు మరియు స్టేషన్లను ప్రైవేట్ ఈవెంట్‌ల కోసం మెట్రో స్టేషన్ లోనూ, రైలులోనూ అద్దెకు ఇవ్వనున్నారు. ఇందుకు గంటకు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం యువతలో ప్రీ-వెడ్డింగ్ ఫోటో మరియు వీడియో షూట్స్‌కు భారీ డిమాండ్ ఉంది. ఈ ట్రెండ్‌ను గమనించిన మెట్రో అధికారులు, మెట్రో రైలు కోచ్‌లను షూటింగ్ లొకేషన్‌గా ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించారు.

ప్రీ-వెడ్డింగ్ షూట్స్‌తో పాటు వేడుకల ఫోటో షూట్స్ మెట్రోలోనే
అందమైన మెట్రో ఇంటీరియర్, ఆధునిక లైటింగ్‌తో నవజంటలు తమ ప్రేమ కథను అపూర్వంగా చిత్రీకరించుకునేలా ప్లాన్ చేశారు. సినిమా స్టైల్‌లో డాన్స్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించడానికి ఇది ఆకర్షణీయమైన లొకేషన్ అవుతుంది. ప్రీ-వెడ్డింగ్ షూట్స్‌తో పాటు పుట్టినరోజు వేడుకలు, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, కిట్టీ పార్టీలు, చిన్న చిన్న కార్పొరేట్ ఈవెంట్స్ కూడా మెట్రోలో నిర్వహించవచ్చు.
ప్రయాణికులకు కొత్త అనుభవం, మెట్రోకు ఆదాయం
సినిమా షూటింగ్‌లు, వెబ్ సిరీస్ సన్నివేశాలు కూడా ఇక్కడ చేయడానికి అనుమతి ఉంది. ఇలా డిఫరెంట్ ప్లాన్ తో మెట్రో ఆదాయం పెరగడంతో పాటు, ప్రయాణికులకు కొత్త అనుభవం కూడా లభిస్తుంది. భోపాల్ మరియు ఇండోర్ మెట్రోలు ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కొత్త పథకం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
ఖరీదైన లొకేషన్లు, విదేశాలు వెళ్లాల్సిన పని లేదు
ఈ పథకం యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రీ-వెడ్డింగ్ షూట్స్ కోసం ఖరీదైన లొకేషన్లు, విదేశాలు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సొంత నగరంలోనే మెట్రోలోనే అద్భుతమైన షూట్ చేసుకోవచ్చు. అందమైన డిజైన్, ఆధునిక సౌకర్యాలు ఉన్న మెట్రో కోచ్‌లు ఫోటోలు మరియు వీడియోలకు అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌గా మారతాయి. ఈ స్కీమ్ ఇక్కడ సక్సెస్ అయితే మిగతా రాష్ట్రాలలో కూడా మెట్రో ఈ తరహా స్కీమ్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications