పాకిస్థాన్ కు కోలుకోలేని దెబ్బ.. కాశ్మీర్ లో రెండు ప్రాజెక్టులతో భారత్ నయా ప్లాన్..
జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలడంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. అంతేకాక పాకిస్థాన్ పై ఆర్థిక, దౌత్య పరమైన అలాగే వ్యూహాత్మక ఆంక్షలను భారత్ విధించింది.
అందులో ముఖ్యంగా సింధూ జలాల ఒప్పందం నిలిపివేత ఒకటి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్- పాకిస్థాన్ తో ఉన్న 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. పాకిస్థాన్ లో ఉగ్రవాదం పూర్తిగా అణిచివేసేంత వరకూ ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించలేమని భారత్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో పశ్చిమ నదులపై ముఖ్యంగా చీనాబ్ నదిపై హక్కులను పూర్తిగా వినియోగించుకోవడానికి భారత్ ఈ భారీ ప్రాజెక్ట్ లను వేగవంతం చేసింది.
కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ నదిపై సుమారు రూ. 3,200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన దుల్హస్తీ స్టేజ్ 2 జలవిద్యుత్ ప్రాజెక్ట్ కు పర్యావరణ అనుమతులు లభించాయి. ఇది గతంలో ఉన్న 390 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్ 1 ప్రాజెక్ట్ కు పొడిగింపుగా ఉంది. అలాగే చీనాబ్ నదిపై అత్యంత కీలకమైన, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న 1,856 మెగావాట్ల సవాల్ కోట్ ప్రాజెక్ట్ పనులకు కేంద్రం వేగవంతం చేసింది. ఈ మేరకు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఈ డ్యామ్, టన్నెల్స్ నిర్మాణానికి అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. ఈ మొత్తం ప్రాజెక్ట్ వ్యయం సుమారు రూ. 22, 700 కోట్లు ఉంటుందని అంచనా..

ఇక ప్రస్తుతం సింధూ నది జలాలా ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో దశాబ్దాలుగా పాకిస్థాన్ అభ్యంతరాల వల్ల ఆగిపోయిన సవాల్ కోట్, పాకల్ దుల్, రాతల్, కిరు వంటి మెగా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి జమ్మూ కాశ్మీర్ ఇంధన అవసరాలను తీర్చాలని భారత్ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications