ఏపీలో ముందస్తు ఎన్నికలు ? ఈసీకి సాయిరెడ్డి షాకింగ్ డిమాండ్..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి, ఆ పార్టీ అధికారం కోల్పోయాక రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy).. తిరిగి ఈ మధ్య యాక్టివ్ అయిపోయారు. రాజకీయాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ముందు విజయసాయిరెడ్డి ఓ షాకింగ్ డిమాండ్ పెట్టారు.

బాబు గారూ మీకు అర్థమవుతోందా..! వైసీపీ డిమాండ్ తో సాయిరెడ్డి పంచ్..!
బాబు గారూ మీకు అర్థమవుతోందా..! వైసీపీ డిమాండ్ తో సాయిరెడ్డి పంచ్..!

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2029 ఏప్రిల్ లేదా మే నెలలో జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల్ని కాస్తా ముందుకు జరపాలనే డిమాండ్ ను సాయిరెడ్డి తెరపైకి తెచ్చారు. ఈ మేరకు ఈసీకి విజ్ఞప్తి చేస్తూ ఎక్స్ లో ఓ ట్వీట్ చేశారు. అందుకు గల కారణాల్ని కూడా సాయిరెడ్డి ఆ ట్వీట్ లో వెల్లడించారు. ఇప్పటికే ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్న సాయిరెడ్డి మాజీ పార్టీ నేతలు ఈ ట్వీట్ చూసి సంతోష పడుతున్నారు.

Vijayasai Reddy to EC Advancing 2029 Election Schedule Is a Public Health Necessity
పిల్లల్ని కనేయా చేయడమెలా? చంద్రబాబుకు సాయిరెడ్డి సలహా..!
పిల్లల్ని కనేయా చేయడమెలా? చంద్రబాబుకు సాయిరెడ్డి సలహా..!

భారత దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ తీవ్రమైన వేడిగాలులు, కేవలం మూడేళ్లలోనే సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలోనే జరగనున్నాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయని సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఉష్ణోగ్రతలు నిలకడగా 40°C కంటే ఎక్కువగా ఉంటున్న ఈ తరుణంలో, ర్యాలీలు, సభలు, రాజకీయ ప్రచారాల కోసం లక్షలాది మంది ప్రజలు గుమిగూడాల్సి రావడం ప్రజారోగ్యంపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తోందని సాయిరెడ్డి తెలిపారు. ఓటర్ల ఆరోగ్యం దృష్ట్యా, ఎన్నికల షెడ్యూల్‌ను కొన్ని నెలల పాటు ముందుకు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో.. సాయిరెడ్డి వినతిపై ఈసీ ఎలా స్పందిస్తుందే చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+