బండి భగీరథ్ పోక్సో కేసులో కొత్త ట్విస్ట్.. మళ్ళీ అదనపు సెక్షన్లు.. ఎందుకంటే!

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ అప్పీల్‌ను అతని తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పోలీసులు భగీరథ్‌ను అరెస్టు చేయడంతో ఈ పిటిషన్ ను వెనక్కు తీసుకున్నారు. ఇక ఇదే సమయంలో ఈ కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

హైకోర్టులో మెమో సమర్పించి బెయిల్ పిటిషన్ వెనక్కి

ఈ కేసులో భగీరథ్ తరపు న్యాయవాది హైకోర్టులో మెమో సమర్పించి బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. ముందుగా అరెస్టు నుంచి రక్షణ కోసం దాఖలు చేసిన ఈ అప్పీల్‌పై హైకోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వాల్సి ఉంది. కానీ అదే సమయంలో పోలీసులు భగీరథ్‌ను అరెస్టు చేయడంతో బెయిల్ విషయంలో మరిన్ని వాదనలు అవసరం లేకుండా పోయింది.

Bandi Bhageerath POCSO case Anticipatory bail withdrawn SIT adds Section 238 for evidence tampering

ఆధారాలను దాచి పెడుతున్న బండి భగీరధ్

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) లోతుగా దర్యాప్తు చేస్తోంది. బాధితురాలైన మైనర్ బాలిక మరియు ఆమె తల్లిని విచారించిన అధికారులు వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. అంతేకాకుండా భగీరథ్ స్నేహితులను కూడా విచారణకు పిలిచి కీలక సమాచారం సేకరించారు. భగీరథ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు ఆధారాలు దాచి పెడుతున్నట్టు గుర్తించారు.

అదనంగా ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్ 238

ఫోన్‌లో సిమ్ కార్డు లేదని తెలిసి అడగ్గా, ఎక్కడో పెట్టి మర్చిపోయానని భగీరథ్ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఇలాంటి సందేహాస్పద ప్రవర్తన నేపథ్యంలో ఆధారాలు దాచిపెట్టడం లేదా నాశనం చేయడానికి సంబంధించిన సెక్షన్ 238ను అదనంగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. గతంలో ఉపయోగించిన సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులు, డిజిటల్ ఆధారాలు తొలగించినట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే శిక్ష మరింత కఠినంగా ఉండవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వరంగల్ ప్రాంతీయ ప్రభుత్వ నేత్ర వైద్య ఆసుపత్రికి మహర్దశ
వరంగల్ ప్రాంతీయ ప్రభుత్వ నేత్ర వైద్య ఆసుపత్రికి మహర్దశ

బండి భగీరథ్ అరెస్ట్ పై బండి సంజయ్ వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్

ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, బండి సంజయ్ మాత్రం చట్టానికి గౌరవం ఇచ్చి విచారణకు సహకరించడం కోసం కుమారుడిని పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, భగీరథ్ స్వయంగా సరెండర్ కాలేదని, పోలీసుల తనిఖీల్లో అరెస్టు చేశారని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+