చల్లటి కబురు, ఈ నెలలోనే రుతుపవనాలు - తెలుగు రాష్ట్రాల్లో ఇలా...!!
తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఎండలు మండిపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అత్యధికంగా 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సారి వర్షాకాలం ముందే రానున్నట్లు వెల్లడించింది. నైరుతీ రుతు పవనాలు కేరళను తాకే తేదీల పైన స్పష్టత వచ్చింది. కాగా, ఒక వైపు ఎండలు మండుతున్న సమయంలో నే రెండు తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాలకు వర్షాల అలర్ట్స్ జారీ అయ్యాయి.
ఈ సారి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎండలు మండుతున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయి. మరో మూడు రోజుల్లో అండ మాన్ ను తాకనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మే 25న కేరళను తాకనున్నట్లు వెల్లడించారు. అంచనా వేసినట్లు ముందుగానే రుతుపవనాలు కేరళను చేరితే, అప్పుడు 2009 తర్వాత తొలిసారి వర్షాకాలం ముందుగా వస్తున్నట్లు ఐఎండీ వెల్లడించింది. 2009 సంవత్స రంలో మే 23వ తేదీన నైరుతీ కేరళను తాకినట్లు ఐఎండీ డేటా చబుతోంది. సాధారణంగా జూన్ ఒకటో తేదీ వరకు కేరళలోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ రుతుపవనాల రాకతో వర్షాకాలం ప్రారంభం అవుతుంది.

ఈ నెలాఖరు నాటికి వర్షాలు ప్రారంభం
ఇదే సమయంలో నైరుతి రుతుపవనాలపై కూడా ఐఎండీ చల్లటి కబురు అందించింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని, మే 14 నుంచి 16వ తేదీ మధ్యలో రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులను తాకే అవకాశం ఉందని చెప్పింది. ఇది సాధారణ సమయం కంటే కొంచెం ముందే కావడం గమనార్హం. దీంతో మే నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ భారతంలో మంచి వర్షాలు కురిసినప్పటికీ, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని చెప్పింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి నాలుగు నెలల్లో వర్షపాతం సాధారణ స్థాయి కంటే ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు.













Click it and Unblock the Notifications