బీజేపీలో చేరిన ఆప్ ఎంపీల ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్, వాట్ నెక్స్ట్...!!
ఆప్ పై బీజేపీ గురి పెట్టింది. ఆప్ రాజ్యసభ సభ్యులు ఏడుగురు బీజేపీలో చేరారు. మిగిలిన సభ్యుల విషయంలో డైలమా కొనసాగుతోంది. పది మంది సభ్యులు ఉన్న ఆప్ నుంచి ఏడుగురు బీజేపీలో విలీనం అయ్యారు. ఈ వ్యవహారంలో ఆప్ కౌంటర్ చర్యలకు సిద్దమైంది. పంజాబ్ లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల కోసం రాజకీయ కసరత్తు మొదలైంది. ఈ సమయంలో పార్టీ మారిన ఎంపీల ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడారు. బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. దీంతో రాజ్యసభలో ఆప్‌నకు ఉన్న 10 మంది ఎంపీల్లో మెజారిటీ ఎంపీలు పార్టీని వీడినట్లయ్యింది. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో ఆరుగురు పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నవారే కావటంతో.. వారితో పంజాబ్‌లో ఆప్‌నకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా.. ఈ పరిణామాలు ఆప్‌ను తీవ్ర సంకటంలోకి నెట్టివేశాయి. ఇదంతా రాఘవ్‌చద్దా తదితర ఆప్ ఎంపీల ఆకస్మిక మీడియా సమావేశంతో ప్రారంభమైంది. తమ బృందం బీజేపీలో విలీనమవుతున్నట్లు తమ సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్‌కు సమర్పించామన్నారు.













Click it and Unblock the Notifications