Tamil Nadu Politics: విజయ్ కు తాజా ఆఫర్..! ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్..!
తమిళనాడులో మొన్నటి వరకూ ఓ లెక్క. నిన్న సాయంత్రం నుంచీ మరో లెక్కలా రాజకీయం మారిపోయింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Assembly election 2026) ఈనెల 23న ముగిసిపోయినా విజయ్ పార్టీ టీవీకేపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కేవలం 2-4 సీట్లు వస్తాయనే అంచనాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఏకంగా టీవీకే (TVK) అధికారంలోకి వస్తుందంటూ యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ చాలా లెక్కల్ని మార్చేసింది.
ఎన్నికల ముందు విజయ్ (Vijay)తో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన అన్నాడీఎంకే-బీజేపీ కూటమి .. ఇప్పుడు మరోసారి రంగంలోకి దిగింది. విజయ్ తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) తమిళనాడు ఎన్నికల్లో బలమైన అరంగేట్రం చేయబోతోందని తేల్చడంతో అన్నాడీఎంకే.. ఆ పార్టీతో పొత్తు చర్చలకు సిద్ధమవుతోంది. 234 మంది సభ్యుల అసెంబ్లీలో టీవీకే గెలిచే స్థానాల సంఖ్యను బట్టే విజయ్ పాత్ర నిర్ణయించబడుతుందని తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా విజయ్ 37% మద్దతుతో ముందుండగా, ప్రస్తుత సీఎం స్టాలిన్ 35%తో స్వల్పంగా వెనుకబడ్డారు. టీవీకే 35% ఓట్లను పొందగలదని, ఇది అధికార కూటమికి సమానమని యాక్సిస్ మై ఇండియా సర్వే తెలిపింది; అన్నాడీఎంకే కూటమికి 23 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే తెలిపింది. అలాగే టీవీకే 98-120 స్థానాలను, డీఎంకే కూటమి 92-110, ఎన్టీయే 32 స్థానాలను గెలుచుకుంటాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పెద్దలు తమకు ఉన్న అన్ని మార్గాల్లో విజయ్ ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సర్వే నిజమైతే విజయ్ కు సీఎం ఇచ్చేందుకు కూడా సిద్దమని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications