స్టాలిన్ నివాసానికి వెళ్లిన సీఎం విజయ్ కు ఊహించని విధంగా..!!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయంగా కీలక అడుగు వేసారు. కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 24 గంటల్లోనే తన మార్క్ చూపిస్తున్నారు. మెజార్టీకి తక్కువగా సంఖ్యా బలం ఉండటంతో.. డీఎంకే మిత్రపక్షాలతో కలిసి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసారు. ఎన్నికల ప్రచారంలో సవాళ్లు - ప్రతి సవాళ్లతో హెరెత్తించిన స్టాలిన్ - సీఎం విజయ్ ఈ రోజున రాష్ట్ర ప్రజలకు భిన్నంగా కనిపించారు. స్టాలిన్ నివాసానికి వెళ్లిన విజయ్ కు ఊహించని స్పందన ఎదురైంది.
సీఎం విజయ్ మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నే విజయ్ మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి మార్యాద పూర్వకంగా కలిసారు. ఇంటి వద్దకు వెళ్లగానే మాజీ డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ సీఎం విజన్ ను ఆలింగనం చేసుకొని ఆహ్వానం పలికారు. స్టాలిన్ సైతం విజయ్ ను ఆలింగనం చేసుకుంటూ.. అభినందించారు. సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇద్దరి మధ్య మర్యాద పూర్వకంగా పలకరింపులు.. పలు అంశాల ప్రస్తావన జరిగింది. విజయ్ ప్రభుత్వ ఏర్పాటు కు అవసరమైన పూర్తి మెజార్టీకి దూరంగా ఉన్న సమయంలో డీఎంకే మిత్రపక్షాలు మద్దతుగా నిలిచాయి. కాంగ్రెస్ తొలుత డీఎంకేతో సంప్రదించకుండా విజయ్ కు మద్దతు ఇవ్వటంతో కాంగ్రెస్ తో డీఎంకే కటీఫ్ చెప్పింది. విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ హాజరయ్యారు.

తమిళ రాజకీయాల్లో కొత్త శకం
https://twitter.com/ANI/status/2053779520130613324ఇక, ప్రభుత్వ ఏర్పాటు చేసిన వెంటనే విజయ్ సీఎం హోదాలో తన తొలి ప్రసంగంలో రాష్ట్ర బడ్జెట్ అప్పుల్లో ఉందని చెప్పుకొచ్చారు. దీనికి స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. మిగులు బడ్జెట్ తో రాష్ట్ర బడ్జెట్ అప్పగించామని.. పథకాలు అమలు చేయాలని సూచించారు. ఇద్దరి మధ్య రాజకీయంగా ఇప్పటికే డైలాగ్ వార్ సాగుతున్న సమయంలో స్టాలిన్ ఇంటికి విజయ్ వెళ్లటం.. స్టాలిన్- ఉదయ నిధి స్టాలిన్ ఆత్మీయంగా ఆహ్వానించటం పైన సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటు న్నారు. ఆ తరువాత వైకో.. అన్నా డీఎంకే నేతల ఇళ్లకు సీఎం విజయ్ వెళ్లారు. ఈ నెల 13న అసెంబ్లీలో విజయ్ బల పరీక్ష ఎదుర్కోబోతున్నారు. ప్రస్తుతం విజయ్ కు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో.. ఈ పరీక్షలో విజయ్ నెగ్గటం లాంఛనంగా కనిపిస్తోంది. ఇక.. స్టాలిన్ - విజయ్ కలిసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.













Click it and Unblock the Notifications