మేం రెడీ.. టీవీకేకు సంకేతాలు
తమిళనాడులో సంచలన విజయం సాధించింది.. తమిళగ వెట్రి కజగం (టీవీకే). 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 108 స్థానాల్లో జెండా ఎగురవేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. డీఎంకే- 59, ఏఐఏడీఎంకే- 47, కాంగ్రెస్- 5, పీఎంకే- 4 సీట్లు స్థానాలకు పరిమితం అయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో నిలిచారు విజయ్. కాంగ్రెస్ మద్దతును తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
కాగా- ఈ పరిణామాల మధ్య తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై టీవీకే చర్యలు ప్రారంభించింది. ప్లాన్ బీ అమలు చేయనుంది. ఈ విషయంలో ఇప్పటికే అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయి కూడా. కాంగ్రెస్, పట్టాళి మక్కల్ కచ్చి (PMK) టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా రెండేసి మంత్రి పదవులను ఆశిస్తున్నట్లు సమాచారం.

ఈ పరిస్థితుల మధ్య లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. విజయ్ తో ఫోన్ లో మాట్లాడారు. ఆయన అభినందనలు తెలిపారు. మద్దతు విషయాన్ని తెలియజేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో షరతులతో కూడిన మద్దతు తెలియజేయడానికి కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనిపై నేడు తుది నిర్ణయాన్ని తీసుకోనుంది కాంగ్రెస్.
Thank you, Hon'ble @PMOIndia, for your greetings. The well-being of our people remains our only goal.
— TVK Vijay (@TVKVijayHQ) May 5, 2026
Transcending politics, we shall focus on the State's progress and the welfare of people of Tamil Nadu. We look forward to the Union Government’s support in this endeavor. https://t.co/EO4h8qC0hF
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ కొత్త పార్టీ సాధించిన భారీ విజయంపై శుభాకాంక్షలు తెలియజేసినందుకు విజయ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ ట్వీట్ కు విజయ్ రిప్లై ఇచ్చారు. ప్రజాసేవలో రాజీపడబోమని, అందరి సహకారంతో రాష్ట్ర సంక్షేమం, సాంస్కృతిక నీతిని పరిరక్షించడానికి తాము కట్టుబడి ఉంటామని, రాజకీయాలకు మించి, తాము తమిళనాడు ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామనీ తేల్చి చెప్పారు.
My sincere thanks to the Honorable Leader of the Opposition in the Lok Sabha for the call and kind wishes! We shall remain committed to excellence in public service, and preserving the cultural ethos of our state which requires collective cooperation. Beyond politics, we shall… https://t.co/dohAfUSq0e
— TVK Vijay (@TVKVijayHQ) May 5, 2026
టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంపై కాంగ్రెస్ తమిళనాడు ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్ ఇది వరకే పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. టీవీకేకు మద్దతు తెలిపే విషయంలో పార్టీ శ్రేణుల అభిప్రాయాల తీసుకున్నామని, వాటిన్నింటినీ క్రోడీకరించి అధిష్ఠానానికి పంపించామని పేర్కొన్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో కూడిన పార్టీ నాయకత్వం తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తుందని ఆయన వివరించారు. టీవీకేకు మద్దతు ఇవ్వడానికి చాలా మంది కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications