అల్లు అర్జున్- రాజమౌళి కాంబోలో ఎవరూ ఊహించని సినిమా..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కోసం అటు ఫ్యాన్స్, ఇటు సగటు సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని అందరూ అనుకుంటారు. ఎంత పెద్ద హీరో అయినా రాజమౌళితో ఒక్కసారైనా కలిసి పనిచేయాలని అనుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో వారణాసి అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ కోసం మహేశ్ బాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పురాణాలు, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయాడు. గంగోత్రి మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన బన్ని.. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కైవసం చేసుకున్నాడు. అలాగే పుష్ప 2 చిత్రంతో ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో రాకా అనే మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్. అలాగే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలోనూ ఓ మూవీలో అల్లు అర్జున్ నటిస్తున్నాడు.

AlluArjun and SS Rajamouli Movie Rumours Go Viral on Social Media Big Pan-India Project Buzz Allu

అయితే ఈ రెండు సినిమాల తర్వాత అల్లు అర్జున్.. రాజమౌళి సినిమాలో నటిస్తారని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్- రాజమౌళి కాంబోలో ఓ సినిమా రానున్నట్లు స్పష్టం అవుతోంది. ఇక అల్లు అర్జున్ టాలెంట్, హార్డ్ వర్క్ పై ఇప్పటికే రాజమౌళి అనేకసార్లు బహిరంగంగానే ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి వారణాసి మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ తో ఓ మూవీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే విషయంపై అటు రాజమౌళి, ఇటు అల్లు అర్జున్ నుంచి ఎలాంటి స్పందన లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+