పెసలు మసాలా కూర: అన్నం, చపాతీల్లోకి అదరహో.. ట్రై చెయ్యండి!
మనం తినే ఆహారంలో రకరకాల కూరలు వండుకుని తింటూ ఉంటాం. ఇక అలాంటి కూరలలో మంచి పోషకాలు ఉండే కూరలు తినటం చాలా మంచిది. నేడు మనం పచ్చ పెసలతో రైస్ మరియు చపాతీ రెండింటిలోకీ అదిరిపోయే రుచికరమైన "పెసలు మసాలా కూర" ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం. ఈ కూర ఇది చాలా సులువుగా తయారు చేయటంతో పాటు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
కావలసిన పదార్థాలు
పచ్చ పెసలు: 1 కప్పు (2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 1 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 3 (నిలువుగా కోసినవి)
టమాటాలు: 2 (చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1
కారం: 1 స్పూన్
ధనియాల పొడి: 1 స్పూన్
జీలకర్ర పొడి: 1/2 స్పూన్
గరం మసాలా: 1/2 స్పూన్
పసుపు : పావు స్పూన్
నూనె: 2 స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: సన్నగా తరిగినది

తయారీ విధానం
ముందు నానబెట్టిన పెసలను కుక్కర్ లో వేసి, తగినన్ని నీళ్లు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 2-3విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉడుకు మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. పెసరపప్పు పేస్ట్ లా లేకుండా చూసుకోవాలి. ఆపై పాన్ లో నూనె వేడిచేసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించాలి.
రైస్ మరియు చపాతీ రెండింటిలోకీ అద్భుతం
ఇప్పుడు టమాటా ముక్కలు వేసి, అవి మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. ఉడికించిన పెసలు నీటితో సహా ఈ ఉడికించిన దానిలో వేయాలి. దీనిలో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. మూతపెట్టి 5-7 నిమిషాలు మీడియం మంటపై ఉడకనివ్వాలి. గ్రేవీ చిక్కబడే వరకు ఉంచుకోవాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.ఈ గ్రేవీ రైస్ మరియు చపాతీ రెండింటిలోకీ అద్భుతంగా ఉంటుంది. ఇది మన శరీరానికి కావలసిన న్యూట్రిషన్ కూడా అందిస్తుంది. మరి అద్భుతమైన ఈ కూర వండుకుని తిని ఆరోగ్యంగా ఉండండి.













Click it and Unblock the Notifications