భారత్ కు పాకిస్థాన్ పెను సవాల్.. 10,000 కోట్లతో బిగ్ స్టెప్..!
భారత్ కు సరిహద్దు దేశం అయిన పాకిస్థాన్ తో ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. గతేడాది ఏప్రిల్ 22 న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులను పాకిస్థాన్ ఉగ్రవాదులు కాల్చిచంపారు. అందుకు ప్రతీకారంగా మే 7-10 మధ్య పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రమూకలను సైతం హతమార్చింది. అలాగే పాకిస్థాన్ లోని ఎయిర్ బేస్ లను కూడా భారత్ సైన్యం ధ్వంసం చేసింది. అయితే పాకిస్థాన్ మాత్రం ఎంత కొట్టినా చావని పాములా వ్యవహరిస్తోంది. ఓ వైపు భారత్ ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తున్నా.. పాకిస్థాన్ మాత్రం సరిహద్దు ప్రాంతాల్లో అలజడులు సృష్టించేందుకు యత్నిస్తూనే ఉంది.
తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి మద్దతుతో కూడిన ఆర్థిక సంస్కరణల కార్యక్రమంలో భాగంగా పాకిస్థాన్ తన సైనిక వ్యయాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను పాకిస్థాన్ తన రక్షణ బడ్జెట్ ను 100 బిలియన్ పాకిస్థానీ రూపాయలకు పెంచాలని ప్రణాళికలు వేస్తోంది. దీంతో పాకిస్థాన్ రక్షణ రంగ వ్యయం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోని PKR 2.564 ట్రిలియన్ల నుంచి PKR 2.665 ట్రిలియన్లకు పెరగనుంది. ఈ మేరకు పాకిస్థాన్ వార్షిక వ్యయంలో అప్పుల చెల్లింపుల తర్వాత సైనిక వ్యయమే రెండో అతిపెద్ద భాగం కావడం గమనార్హం.
ఇక పాకిస్థాన్ కు సంబంధించిన 7 బిలియన్ డాలర్ల ఎక్స్ టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ, అలాగే 1.4 బిలియన్ డాలర్ల రెసిలియన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ సమీక్షల అనంతరం ఐఎంఎఫ్ ప్రచురించిన ఒక నివేదిక ఆధారంగా చేసుకుని ఈ పెంపును ప్రతిపాదించారు. ఈ బడ్జెట్ మొత్తం ఫెడరల్ ఆదాయాల్లో 13.5 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. దీని ప్రకారం మొత్తం ఆదాయం PKR 17.144 ట్రిలియన్లకు చేరుకుంటుందని తెలుస్తోంది. ఇది ప్రస్తుత సంవత్సరం కంటే PKR 2 ట్రిలియన్లకు పైగా ఎక్కువే.

మరోవైపు ఐఎంఎఫ్ ప్యాకేజీ నిబంధనల్లో భాగంగా పాకిస్థాన్.. జూన్ 2027 నాటికి అన్ని ఫెడరల్, ప్రాంతీయ ప్రభుత్వ చెల్లింపులను పూర్తిగా డిజిటలైజ్ చేయడం.. అలాగే ఈ ఏడాది చివరి నాటికి అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టాప్ 10 ప్రభుత్వ సంస్థలను గుర్తించి వాటిపై ఆడిటింగ్ నిర్వహించడం, దాంతోపాటు ప్రాంతీయ అవినీతి నిరోధక విభాగాలను బలోపేతం చేయడం లాంటివి ఉన్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం ఓవైపు ఆదాయ వృద్ధి కోసం ఈ సంస్కరణలు చేపడుతున్నప్పటికీ.. పాకిస్థాన్ జనాభాలో దాదాపు 40 శాతం మంది ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇక వచ్చేనెలలోనే అధికార బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనలను ఖరారు చేసేందుకు ప్రస్తుతం ఐఎంఎఫ్ బృందం పాకిస్థాన్ లో పర్యటన నిర్వహిస్తోంది. ఇక పాకిస్థాన్ రక్షణవ్యయం పెంచుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. పాకిస్థాన్ చర్యల్ని నిశితంగా పరిశీలిస్తోంది.












Click it and Unblock the Notifications