చరిత్ర సృష్టించబోతున్న విజయ్..! సుప్రీంకోర్టుకు అంతా వాళ్లే..!
తమిళనాడులో తొలిసారి పార్టీ పెట్టి రెండేళ్లలోనే అధికారంలోకి వచ్చిన టీవీకే అధినేత విజయ్ (Vijay).. పాలనపై తన మార్కు ఉండేలా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తనకు అత్యధిక సంఖ్యలో ఓటేసిన మహిళా ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తమిళనాడు చరిత్రలోనే ఇలాంటి నిర్ణయం తొలిసారి కానుంది.
తమిళనాడు తరఫున సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం వహించే అదనపు అడ్వకేట్ జనరల్స్, అలాగే స్టాండింగ్ కౌన్సిల్స్ గా మహిళలనే పంపాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న మహిళా న్యాయవాదుల పేర్లను సిద్దం చేస్తున్నారు. అయితే కేవలం మహిళలను మాత్రమే ఈ కీలక పోస్టులకు ప్రభుత్వం ప్రతిపాదిస్తుండటం మాత్రం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కానుంది.

తనకు ఓటేసిన మహిళలకు గుర్తుండిపోయేలా విజయ్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడుకు చెందిన మహిళలు జాతీయ స్దాయిలో సత్తా చాటుకుంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ అదనపు ఏజీలులుగా, స్టాండింగ్ కౌన్సెళ్లుగా అవకాశం లభిస్తే జాతీయ స్ధాయిలో ఇదో ప్రాధాన్య అంశంగా కూడా మారే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ప్రయత్నిస్తున్న తరుణంలో విజయ్ నిర్ణయం రాజకీయంగా కూడా చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications