GST చరిత్రలో బిగ్గెస్ట్ రికార్డ్. ఏప్రిల్‌లో ఏకంగా...

దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి సూచికగా భావించే జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను) వసూళ్లు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి నెలలోనే ప్రభుత్వం భారీ ఆదాయాన్ని ఆర్జించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2026లో దేశ స్థూల జీఎస్‌టీ రాబడి ఏకంగా రూ. 2,42,702 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే నెలలో వసూలైన రూ. 2,23,265 కోట్లతో పోలిస్తే ఇది 8.7 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.

ఈసారి జీఎస్‌టీ వృద్ధిలో దిగుమతులపై పన్ను రాబడి కీలక పాత్ర పోషించింది. దేశీయ వసూళ్ల కంటే దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే వేగంగా వృద్ధి చెందింది. ఏప్రిల్‌లో దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 57,580 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో (రూ. 45,754 కోట్లు) పోలిస్తే ఇది ఏకంగా 25.8 శాతం పెరుగుదల. మరోవైపు దేశీయ స్థూల రాబడి 4.3 శాతం వృద్ధి చెంది రూ. 1,85,122 కోట్లకు చేరుకుంది.

GST Revenue Surge Record-Breaking Rs 2 42 Lakh Crore Collected in April 2026 as Import Tax Grows

వసూలైన మొత్తం రూ. 2,42,702 కోట్లలో..

  • CGST (కేంద్ర జీఎస్‌టీ): రూ. 52,140 కోట్లు
  • SGST (రాష్ట్ర జీఎస్‌టీ): రూ. 61,331 కోట్లు
  • IGST (ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ): రూ. 71,651 కోట్లుగా ఉన్నాయి.

పెరిగిన రీఫండ్లు.. నికర ఆదాయం ఇలా..

పన్ను వాపసులు (రీఫండ్స్) సర్దుబాటు చేసిన తర్వాత, ఏప్రిల్ 2026 నికర జీఎస్‌టీ ఆదాయం రూ. 2.10 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే నికర ఆదాయంలో 7.3 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తం వాపసులు 19.3 శాతం పెరిగి రూ. 31,793 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో దేశీయ వాపసులు భారీగా (54.6%) పెరిగినప్పటికీ, ఎగుమతి సంబంధిత వాపసులు మాత్రం 14 శాతం తగ్గుముఖం పట్టాయి.

దక్షిణాది రాష్ట్రాల జోరు.. తెలంగాణ టాప్!

రాష్ట్రాల వారీగా చూస్తే దక్షిణాది రాష్ట్రాలు, పారిశ్రామిక రాష్ట్రాలు అద్భుతమైన పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా తెలంగాణ 36 శాతం వృద్ధిని నమోదు చేసి సత్తా చాటింది. మహారాష్ట్ర 40 శాతం, కర్ణాటక 42 శాతం వృద్ధితో దూసుకుపోతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఏకంగా 108 శాతం వృద్ధితో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే లడఖ్ (-8%) వంటి ప్రాంతాల్లో స్వల్ప క్షీణత కనిపించగా, జార్ఖండ్ స్థిరంగా కొనసాగింది.

మొత్తానికి, మార్చి నెలలో నమోదైన రూ. 2.00 లక్షల కోట్ల వసూళ్ల రికార్డును ఏప్రిల్ నెల అధిగమించింది. వరుసగా జీఎస్‌టీ రాబడి పెరుగుతుండటం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+