మీరు స్పెషల్ ఫ్లైట్లలో.. మేం సైకిళ్లపైనా? చంద్రబాబుకు సీబీఐ మాజీ బాస్ పంచ్..!

అమెరికా-ఇరాన్ యుద్దాన్ని సాకుగా చూపుతూ దేశవ్యాప్తంగా పొదుపు పాటించాలని ప్రధాని మోడీ తాజాగా ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి కొనసాగింపుగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు తమ కాన్వాయ్ లను కుదించుకున్నారు. అలాగే వారంలో ఒకటి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్, ఒక రోజు నో హెవికల్ డేలు పాటించేందుకు సిద్దమవుతున్నారు. ఏపీలో నిన్న జరిగిన కేబినెట్ లో సీఎం చంద్రబాబు (Chandrababu) సైతం వారంలో ఒకరోజు సచివాలయానికి సైకిళ్లపై వచ్చేలా ప్లాన్ చేయాలని సూచించారు. దీనిపై విమర్శలు మొదలయ్యాయి.

ఏపీలో ఆదివారం పెట్రోల్ బంకుల బంద్ ? తేల్చేసిన ట్రేడర్స్ యూనియన్..!
ఏపీలో ఆదివారం పెట్రోల్ బంకుల బంద్ ? తేల్చేసిన ట్రేడర్స్ యూనియన్..!

అయ్యా చంద్రబాబు గారూ.. సైకిళ్లపై సచివాలయానికి వెళ్లే నాటకీయం చేయాల్సిన అవసరం లేదు గానీ, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు, మీ మంత్రులు, మీ పార్టీ నాయకులు ప్రత్యేక విమానాల్లో (చార్టర్డ్ ఫ్లైట్స్ లో) ప్రయాణాన్ని (అధికారికంగా అయినా వ్యక్తిగతంగా అయినా) తక్షణమే నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వండి, వాటిని కఠినంగా పాటించండి అంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చురకలు అంటించారు. అలా చిత్తశుద్ధి ప్రదర్శించకుండా "ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి" అని మీరు పాడితే, "డోంట్ కేర్" అని ప్రజలు మీకు ఎదురు పాడతారు అంటూ హెచ్చరించారు.

Ex-CBI Chief to Chandrababu Cycling to Office Means Nothing If Special Flights Still Fly
Fuel Hike: ఇది జస్ట్ శాంపిల్... రూ.28 మేర పెరగనున్న పెట్రో ధరలు?
Fuel Hike: ఇది జస్ట్ శాంపిల్... రూ.28 మేర పెరగనున్న పెట్రో ధరలు?

రాష్ట్రంలో ఓవైపు సీఎం చంద్రబాబు కాన్వాయ్ కుదించుకుని, మంత్రులకు సైతం ఇదే హితబోధ చేస్తున్నారు. అలాగే నో వెహికల్ డేల ద్వారా ఇంధన వాడకం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో తాజాగా సత్యసాయి జిల్లా పర్యటనకు మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లడం, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్ తో వెళ్లడంపై వైఎస్సార్సీపీ ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తోంది. చంద్రబాబు మాటను ఆయన కుమారుడే పట్టించుకోవడం లేదని విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ట్వీట్ చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+