"సన్ స్క్రీన్ రాసుకున్నావా ? "-తిలక్ వర్మపై అర్ష్ దీప్ చీప్ కామెంట్స్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో ఆడుతున్న ఇద్దరు టీమ్ ఇండియా ఆటగాళ్ల మధ్య జరిగిన ఓ ఘటన ఇప్పుడు జాత్యహంకారాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య నిన్న ధర్మశాలలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో తన అద్భుత పోరాట పటిమతో ముంబైను గెలిపించిన బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma)ను ఉద్దేశించి .. పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ (Arshdeep singh)చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, అర్ష్‌దీప్ తిలక్‌తో "ఓయ్ అందేరే, సన్‌స్క్రీన్ లగాయా?" (ఓయ్ నల్లగా ఉన్నవాడా, సన్‌స్క్రీన్ రాసుకున్నావా?) అని అన్నట్లు స్పష్టంగా వినిపించింది. ఈ వ్యాఖ్య క్రికెట వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అర్ష్ దీప్ వ్యాఖ్యల్ని మాజీ భారత స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ తీవ్రంగా ఖండించారు. తన కెరీర్లో చర్మ రంగుపై ఎదుర్కొన్న వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ, అవి బాధాకరమైన జ్ఞాపకాలని వెల్లడించారు.

Arshdeep Singh made racist comments on Tilak Varma.
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) May 14, 2026
Arshdeep called Tilak “andhera” (darkness) and compared his skin tone with Naman Dhir’s.
Tilak Varma responded maturely, saying, “I won’t encourage this. Let’s focus on tomorrow’s match.” pic.twitter.com/VPX9hkg6nP
వీడియో చూసిన తర్వాత శివరామకృష్ణన్.. అర్ష్‌దీప్‌పై కఠిన చర్యలు, నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. "ఎవరూ నన్ను నమ్మలేదు. అందరూ ఎగతాళి చేశారు. అర్ష్‌దీప్‌ను ఈ సీజన్ నుండి నిషేధించాలి, ప్రొ-రాటా పద్ధతిలో అతనికి ఇవ్వాల్స్ిన డబ్పులు ఇచ్చేయాలన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే నేటి ఆటగాళ్లను బాధ కలిగించే విధంగా శిక్షించాలి. నన్ను మళ్లీ ట్రోల్ చేస్తారని తెలుసు," అని శివరామకృష్ణన్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. మరో పోస్ట్‌లో, "తిలక్ కెరీర్ ప్రారంభ దశలో ఉండటంతో ఏమీ చెప్పలేకపోయినా, ఈ రుజువుతో బీసీసీఐ చర్య తీసుకోవచ్చు," అని శివరామకృష్ణన్ పేర్కొన్నారు. "బీసీసీఐ చర్య తీసుకుంటే, నన్ను జాతి వివక్షకు గురిచేసిన వారి పేర్లను వెల్లడిస్తాను," అని ఆయన తెలిపారు. గతంలో కొంతమంది మాజీ సహచరులు తన చర్మ రంగు కారణంగా "డార్క్ బాయ్" అని పిలిచేవారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications