ప్రముఖ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు,రూట్ - బుకింగ్ పై భారీ రాయితీ..!!
APSRTC కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకుల డిమాండ్ మేరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ మరో ప్యాకేజీ ఖరారు ప్రకటించింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సుల షెడ్యూల్ వెల్లడించింది. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం .. సీనియర్ సిటిజెన్స్ కు 25 శాతం మేర రాయితీ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణీకులకు ప్రయోజనకరంగా మారనుంది.
ఏపీఎస్ ఆర్టీసీ ప్రముఖ పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ప్రకటించింది. తిరుపతి నుంచి పళని, కాకినాడ నుంచి గంగావతి వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. ఈ స్పెషల్ సర్వీసులు ప్రతి రోజూ అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ బస్సుల్లో రాను.. పోను ఒకే సారిగా బుక్ చేసుకుంటే 10శాతం డిస్కౌంట్ వర్తించనుంది. అదే విధంగా వృద్ధులకు 25శాతం రాయితీ అమలు చేస్తున్నారు. ప్రయాణీకులు వాట్సాప్ ద్వారానూ టికెట్ బుకింగ్ అవకాశం కల్పించారు. తిరుపతి నుంచి తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో పళని సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ఉంది. నవపాషాణ మురుగన్ విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ క్షేత్రం వరకు ప్రత్యేక బస్సులు తిరుపతి నుంచి చిత్తూరు, పలమనేరు, కుప్పం, కృష్ణగిరి, ధర్మపురి, మెట్టూరు, ఈరోడ్ మీదుగా పళనికి చేరుకునే విధంగా షెడ్యూల్ ఖరారు చేసారు.

ముందస్తు బుకింగ్ పై రాయితీ
తిరుపతిలో ఈ బస్సు ప్రతీ రోజు రాత్రి 8.30 గంటలకు బయల్దేరుతుంది. పళని టు తిరుపతి బస్సు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు బయల్దేరుతుందని వెల్లడించారు. రిజర్వేషన్ కోసం www.apsrtconline.in వెబ్సైట్ సందర్శించాలని అధికారులు సూచించారు. అదే విధంగా కాకినాడ - గంగావతి (కర్ణాటక) సూపర్ లగ్జరీ బస్సు ప్రతి రోజూ అందుబాటులో ఉంచారు. ద్రాక్షారామం, రామచంద్రాపురం, మండపేట, రావులపాలెం, తణుకు, విజయవాడ, గుంటూరు, దోర్నాల, కర్నూలు, అయిజ, రాయచూర్, మాన్వి, సింధనూర్ మీదుగా గంగావతి చేరుకుంటాయి. కాకినాడలో ప్రతీ రోజు ఉదయం 9.30 గంటలకు ఈ బస్సు బయల్దేరుతుంది.
మొబైల్ నంబర్ 95523 00009 వాట్సాప్ ద్వారా కూడా బుకింగ్స్ చేసుకునే అవకాశం కల్పించారు. ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి 10శాతం రాయితీ కల్పిస్తోంది. సీనియర్ సిటిజన్లకు టిక్కెట్లపై 25శాతం డిస్కౌంట్ ఉంటుందని ఆర్టీసీ ప్రకటించింది.













Click it and Unblock the Notifications