కన్యా రాశిలోకి శుక్రుడు.. సెప్టెంబరు 2 వరకు 4 రాశులకు మహర్దశ పట్టుకుంది

జ్యోతిష్య శాస్త్రంలో ఐశ్వర్యానికి, సౌందర్యానికి, ఆనందానికి ప్రతిరూపమైన శుక్ర గ్రహ సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం సూర్యుడి రాశి అయిన సింహరాశిలో విహరిస్తున్న శుక్రుడు, త్వరలోనే బుధుడి సొంత ఇల్లయిన కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 2 వరకు ఈ సంచారం కొనసాగనుంది. అయితే, దీని కంటే ముందే ఒక కీలకమైన మార్పు రాబోతోంది.

హిందూ పంచాంగం ప్రకారం జూలై 29న శుక్రుడు పూర్వ ఫల్గుణి నుంచి సూర్యుడికి చెందిన ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడు. రాశి మారడం, సూర్యుడి నక్షత్రంలోకి శుక్రుడు చేరడం అనే ఈ రెండు కీలక పరిణామాలు కొన్ని రాశుల జాతకాల్లో ఊహించని మార్పులను తీసుకురాబోతున్నాయి. ఆ అదృష్ట రాశులేవో, వారికి కలగబోయే శుభఫలితాలేంటో చూద్దాం.

Horoscope Venus in Virgo Brings a Golden Phase for Four Zodiac Signs Until September 2

మీన రాశి

ఉత్తర ఫల్గుణిలో శుక్రుడి సంచారం మీన రాశి వారి జీవిత చిత్రాన్నే మార్చబోతోంది. పిత్రార్జితం లేదా పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కలసివస్తాయి.తోబుట్టువులతో బంధం మరింత బలపడుతుంది, వారితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. చదువుల్లో మీదే పైచేయి కానుంది, పరీక్షల్లో ఘనవిజయం సాధిస్తారు.

కుంభ రాశి

సూర్యుడి నక్షత్రంలో శుక్రుడి ప్రవేశం కుంభరాశి వారికి అత్యంత శుభప్రదమైన రోజులను ఇస్తుంది. కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి. వ్యాపారవేత్తలకు అనూహ్యమైన లాభాలు అందుతాయి. తల్లిగారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఇంట్లో ప్రశాంతత, ఆనందం వెల్లివిరుస్తాయి.

ధనుస్సు రాశి

శుక్రుడి నక్షత్ర పరివర్తనం ధనుస్సు రాశి వారికి మహర్దశను మోసుకొస్తోంది. నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా గతంలో కంటే అత్యంత బలమైన స్థితికి చేరుకుంటారు. వ్యాపారంలో సరికొత్త వ్యూహాలు అమలు చేసి అపారమైన లాభాలను ఆర్జిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు విజయం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

వృశ్చిక రాశి

ఈ సంచారం వృశ్చిక రాశి వారి జీవితంలో గోల్డెన్ పీరియడ్‌కు నాంది కానుంది. సొంతింటి కల నెరవేరేందుకు ఇదే సరైన సమయం. నూతన వాహనాలు లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి సరికొత్త అవకాశాలు వచ్చిపడతాయి. విద్యార్థులు కొద్దిగా దృష్టి కేంద్రీకరిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+