ఏపీలో విద్యార్థులకు పండుగే.. ఏకంగా 10 రోజులు హాలిడేస్!
ఏపీలోని స్కూల్స్, కాలేజీల విద్యార్థులకు శుభవార్త. ఆగస్ట్ నెలలో ఆదివారాలు, రెండో శనివారం, జాతీయ మతరపరమైన పండుగలు కలిపి దాదాపు 10 రోజులు సెలవులు రానున్నాయి. ఆగస్ట్ నెలలో మొత్తం 31 రోజులు ఉండగా, అందులో 10 రోజులు సెలవులు రానున్నాయి. ఏపీలో ఆగస్ట్ నెలలో స్కూల్స్ కేవలం 21 రోజులు మాత్రమే కొనసాగనున్నాయి.
ఏపీలో విద్యార్థులకు ఆగస్ట్ లో బోలెడు సెలవులు
ఈ నెలలో 5 ఆదివారాలు ఉండటం కూడా విద్యార్థులకు ఒక ఆదివారం అదనంగా సెలవు రావటానికి కారణంగా మారింది. ఆగస్ట్ నెలలో సెలవుల జాబితా చూస్తే ఆగస్ట్ 2 ఆదివారం సాధారణ సెలవు కాగా, ఆగస్ట్ 8 రెండవ శనివారం సెలవువచ్చింది.ఆగస్ట్ 9 ఆదివారం సాధారణ సెలవు దినం. ఆగస్ట్ 15 శనివారం నాడు స్వాతంత్ర్య దినోత్సవం, జెండా వందనం తర్వాత స్కూల్స్ క్లోజ్ అవుతాయి.

ఏపీలో సెలవులతో పాటు ఆప్షనల్ హాలిడేస్
ఆగస్ట్ 16 ఆదివారం మళ్ళీ సాధారణ సెలవు దినంగా చెప్తున్నారు. ఆగస్ట్ 21 శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కాగా, ఆగస్ట్ 23ఆదివారం సాధారణ సెలవు. ఆగస్ట్ 25మంగళవారం మిలాదున్ నబీ కాగా, ఆగస్ట్ 30 మళ్ళీ సాధారణ సెలవు. ఇక ఉద్యోగులకు కొన్ని ఆప్షనల్ సెలవులు కూడా ఉన్నాయి. వాటిలో ఆగస్ట్ 4న ఐచ్చికసెలవు కాగా, ఆగస్ట్ 15వ తేదీన పార్సీ నూతన సంవత్సరం, ఆగస్ట్ 28న శ్రావణపూర్ణిమ ఉన్నాయి.
పండుగలు, వాతావరణ, పరిపాలనా కారణాలతోనూ హాలిడేస్ అవకాశం
వీటిని సంబంధిత శాఖలు, సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా అమలు చేసుకోవచ్చు. వీటిని ఆప్షనల్ హాలిడేస్ గా తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం సెలవు జాబితాలో చిన్న మార్పులు రావచ్చు. స్థానిక పండుగలు, వాతావరణ పరిస్థితి లేదా పరిపాలన కారణాల వల్ల కూడా అదనపు సెలవులు ప్రకటించే అవకాశం ఉంటుంది.
సింహాచలం వార్షిక గిరి ప్రదిక్షణకు ప్రత్యేక సెలవులు
విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సెలవుల జాబితాను గమనించి ముందుగానే తదనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు. పాఠశాలలు, కళాశాలలు అధికారిక ఉత్తర్వుల ప్రకారం సెలవులను అమలు చేస్తాయి. కాగా విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం ఆలయంలో జరిగే వార్షిక గిరిప్రదక్షిణ కోసం కూడా ప్రత్యేక సెలవులను ప్రకటించారు. జూలై 28, 29 తేదీలలో ప్రదిక్షణ మార్గంలో ఉన్న 221 పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.












Click it and Unblock the Notifications