Malaika Arora:52 ఏళ్ల వయస్సులో కొత్త బాయ్‌ఫ్రెండ్.. తగ్గేదేలే! (వీడియో)
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోకా అరోరా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వయస్సు 50 ఏళ్లు దాటినా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తన కెరీర్లో సినిమాల కంటే ఎక్కువగా ఫోటోషూట్లు, ప్రేమ వ్యవహారాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది ఈ బ్యూటీ క్వీన్. బాలీవుడ్ కుర్రహీరో అర్జున్ కపూర్తో కొంత కాలం డేటింగ్ చేసిన ఈ భామ.. ఇటీవల అతనితో బ్రేకప్ చెప్పేసిన సంగతి తెలిసిందే. ఇటీవల అర్జున్ కపూర్తో బ్రేకప్ చెప్పేసిన విషయం తెలిసిందే. ఆ విషయం మరవకముందే ఊ బ్యూటీ క్వీన్ కు సంబంధించిన మరో లవ్ స్టోరీ బాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
అర్జున్ కపూర్ వ్యవహారం అనంతరం కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్న ఈ భామ.. తాజాగా 52 ఏళ్ల మలైకా అరోరా తనకన్నా 19 ఏళ్లు చిన్నవాడైన ప్రముఖ డైమండ్ మర్చంట్ హర్ష్ మెహతాతో డేటింగ్ లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి డేటింగ్ పుకార్లకు బలం చేకూరుస్తూ కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. తాజాగా ముంబైలో ఓ ప్రైవేటు పార్టీకి వీరిద్దరూ హాజరై వేర్వేరుగా బయటికెళ్తున్న వీడియోలు వైరల్ కావడంతో ఈ రూమర్లకు బలం చేకూరింది. వీటితో పాటు మ్యూజిక్ కన్సర్ట్ లలోనూ, ఎయిర్పోర్టులలోనూ వీరిద్దరి ఫోటోలు, వీడియోలు తెగ వైరలయ్యాయి. కానీ ఈ డేటింగ్ రూమర్లపై వారు ఇంకా స్పందించలేదు. కాగా అర్బాజ్ ఖాన్‌తో విడాకుల తర్వాత మలైకా.. అర్జున్ కపూర్‌తో దాదాపు ఆరేళ్లు డేటింగ్ చేసి విడిపోయారు.

వీరిద్దరూ తమ బంధాన్ని ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారని సమాచారం. కానీ ఎవరికీ కంటపడకుండా ఉండడం బాలీవుడ్ సెలబ్రిటీలకు సాధ్యమయ్యే పని కాదు కదా. ఈ క్రమంలోనే వారి ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో వారి రిలేషన్ కు సంబంధించిన వార్తలు నెట్టింట ఊపందుకున్నాయి. అయితే ఈ రూమర్లపై ఇప్పటివరకు ఇద్దరూ ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. ఈ కొత్త రిలేషన్ పై, హర్ష్ మెహతాతో ఉన్న సంబంధంపై మలైకా అరోరా ఎప్పుడు నోరు విప్పుతుందో చూడాలి.
52 ఏళ్ల మలైకా.. 33 ఏళ్ల యువకుడితో డేటింగ్ రూమర్స్? 👀
— Tupaki (@tupaki_official) July 27, 2026
నటి మలైకా అరోరా (52), డైమండ్ వ్యాపారి **హర్ష్ మెహతా (33)**తో కలిసి ఓ ప్రైవేట్ పార్టీకి హాజరైనట్లు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇద్దరూ డేటింగ్లో ఉన్నారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. అయితే ఈ… pic.twitter.com/nf0YPcNbjq












Click it and Unblock the Notifications