36 ఏళ్ల తర్వాత తీర్పు! తండ్రి ఆస్తిలో కూతురుకు సమాన హక్కు

ఇంటి ఆడబిడ్డకు తండ్రి ఆస్తిలో హక్కుపై దశాబ్దాలుగా సాగుతున్న ఎన్నో అనుమానాలకు ఏపీ హైకోర్టు గట్టి సమాధానం ఇచ్చింది. తండ్రి సంపాదించిన లేదా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిలో కుమారుడితో సమానంగా కుమార్తెకు కూడా పుట్టుకతోనే హక్కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. 2005 సెప్టెంబర్ 9న అమల్లోకి వచ్చిన హిందూ వారసత్వ (సవరణ) చట్టం ప్రకారం.. ఆ తేదీ నాటికి తండ్రి జీవించి ఉండాల్సిన అవసరం లేదని, కుమార్తె జీవించి ఉంటే చాలని న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ మెడమల్లి బాలాజీలతో కూడిన ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.

ఈ కేసు మూలాలు కర్నూలు జిల్లాకు చెందిన వి. మారెప్ప కుటుంబంలో ఉన్నాయి. మారెప్పకు భార్య నాగమ్మ, కుమార్తె వీరమ్మ, కుమారుడు బుసప్ప ఉన్నారు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి విషయంలో తండ్రి, కుమారుడు మరణించిన తర్వాత.. ఆ ఆస్తిలో తమకు వాటా కావాలని భార్య నాగమ్మ, కుమార్తె వీరమ్మ 1988లో కర్నూలు కోర్టును ఆశ్రయించారు. అయితే, అప్పట్లో దిగువ కోర్టు భార్యకు మాత్రమే వాటా ఇచ్చి, కుమార్తె వీరమ్మకు ఆస్తి హక్కును నిరాకరించింది. దీంతో తమ న్యాయమైన హక్కు కోసం తల్లీకూతుళ్లు 1990లో హైకోర్టు మెట్లెక్కారు.

Daughters Have Equal Property Rights Even if Father Died Before 2005 High Court Landmark Verdict in 2026

36 ఏళ్ల సుదీర్ఘ పోరాటం..

1988లో మొదలైన ఈ న్యాయపోరాటం ఎన్నో మలుపులు తిరిగింది. 2003లో విచారణ జరిపిన హైకోర్టు.. మారెప్ప ఆస్తిని భార్య, కుమారుడు, కుమార్తెలకు సమానంగా మూడు భాగాలుగా పంచాలని ఆదేశించింది. అయితే, కాలక్రమంలో నాగమ్మ మరణించడంతో ఆమె వాటాపై మళ్లీ న్యాయపరమైన చర్చ మొదలైంది. తాజాగా ఈ కేసులోని అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. నాగమ్మ వాటాను కూడా పరిగణనలోకి తీసుకుని, తుది నిర్ణయం ప్రకటించింది. మారెప్ప ఆస్తిలో కుమార్తె వీరమ్మ, కుమారుడు బుసప్ప ఇద్దరూ సమాన హక్కుదారులుగా గుర్తిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

తీర్పులోని ముఖ్యాంశాలు:

కుమార్తె పుట్టిన క్షణం నుంచే కుమారుడితో సమానంగా ఆస్తిపై చట్టబద్ధమైన హక్కును కలిగి ఉంటుంది. 2005 సవరణ చట్టం అమల్లోకి వచ్చే సమయానికి తండ్రి మరణించినా సరే, ఆస్తి పంపకాలు పూర్తి కాకపోతే కుమార్తె తన వాటాను క్లెయిమ్ చేయవచ్చు. ఈ తీర్పు వేలాదిగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి వివాదాలకు ఒక దిక్సూచిలా పనిచేయనుంది. ఈ తీర్పు ద్వారా ఆస్తిలో ఆడబిడ్డ వాటా అనేది కేవలం దయతో ఇచ్చేది కాదని, అది ఆమె రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన హక్కు అని హైకోర్టు మరోసారి నిరూపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+