బుధాదిత్య రాజయోగంతో రేపటి నుంచి కోటీశ్వరులు కాబోతున్న వృషభం, ధనుస్సు, మీనరాశులవారు
జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైనదిగా భావించే 'బుధాదిత్య రాజయోగం' మే 16 నుంచి ప్రారంభం కానుంది. గ్రహాల రాకుమారుడు బుధుడు, గ్రహాలకు రాజైన సూర్యుడు ఇద్దరూ కలిసి వృషభ రాశిలో కలుసుకుంటున్నారు. ఇది చాలా అరుదుగా జరిగే పరిణామం. దీనివల్ల మూడు రాశులవారి జాతకాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. ఏయే రాశులనేది తెలుసుకుందాం.
వృషభ రాశి వారికి పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్
సూర్య-బుధుల సంయోగం వృషభ రాశిలోనే జరుగుతుండటంతో, ఈ రాశి వారికి అదృష్టం రెట్టింపు కానుంది. పెండింగ్‌లో ఉన్న బకాయిలు వసూలవుతాయి. థిరాస్తి రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు చేకూరే అవకాశం ఉంది. కొత్త ఇల్లు లేదా ప్లాట్ కొనాలన్న ప్రయత్నాలు ఈ సమయంలోనే నెరవేరతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్ని పనులు పూర్తిచేస్తారు.

ధనస్సు రాశి వారికి వృత్తిలో విజయకేతనం
ధనస్సు రాశి వారికి ఈ రాజయోగం కెరీర్ పరంగా 'బంగారు కాలం' అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, జీతాల పెరుగుదల సూచనలున్నాయి. నిరుద్యోగులకు మంచి సంస్థల నుండి పిలుపు వచ్చే అవకాశం ఉంది. మీపై జరుగుతున్న కుట్రలను చాకచక్యంగా ఎదుర్కొంటారు. మీ ప్రత్యర్థులు మీ ముందు బలహీనపడతారు. స్టాక్ మార్కెట్ లేదా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మిత్రుల సహకారం కొండంత అండగా నిలుస్తుంది.
మీన రాశి వారికి అఖండ విజయాల పరంపర
మీన రాశి వారి జీవితంలో ఇన్నాళ్లూ ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోనున్నాయి. నిలిచిపోయిన ప్రభుత్వ పనులు లేదా కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారతాయి. విలాసవంతమైన వాహనాలు లేదా ఇంటికి కావలసిన ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications