విజయ్ కు డబుల్ బొనాంజా.. ! అంతా స్టాలిన్ స్క్రిప్టేనా ?

తమిళనాడులో ఎన్నికల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రధాన కూటములైన డీఎంకే, అన్నాడీఎంకేల మద్దతు తీసుకోకుండా చిన్న పార్టీలవైపు మొగ్గు చూపిన విజయ్ .. నాలుగు రోజులుగా అందుకు తగ్గ ఫలితం అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ సాయంతో కమ్యూనిస్టుల సాయం పొందడంలో సక్సెస్ అయిన విజయ్.. ఇవాళ కీలకమైన వీసీకే పార్టీ మద్దతు కూడా పొందారు. అదే సమయంలో విజయ్ కు మరో శుభవార్త లబించింది.

విజయ్ కు AIADMK కూటమి పార్టీ గుడ్ న్యూస్ ..! గవర్నర్ కు కీలక వినతి..!
విజయ్ కు AIADMK కూటమి పార్టీ గుడ్ న్యూస్ ..! గవర్నర్ కు కీలక వినతి..!

ఇన్నాళ్లూ డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే వరుసగా విజయ్ కు మద్దతుగా లేఖలు ఇచ్చేయడంతో ఇక చివరి భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కూడా అదే బాట పట్టింది. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తామని రెండు రోజుల క్రితం ప్రకటించి, విజయ్ కు మద్దతివ్వబోమని యూటర్న్ తీసుకున్న ఆ పార్టీ.. ఇవాళ తిరిగి టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా లేఖ ఇచ్చింది. దీంతో డీఎంకే భాగస్వామ్యులంతా విజయ్ వైపు వచ్చేసినట్లయింది.

IUMML Extends Support to TVK After VCK Boosting Vijay s Chances of Forming Tamil Nadu Government
విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై స్టాలిన్ ట్వీట్..! అసెంబ్లీలో ఇక..!
విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై స్టాలిన్ ట్వీట్..! అసెంబ్లీలో ఇక..!

తమిళనాడు అసెంబ్లీలో ఐయూఎంఎల్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. విజయ్ కు ఇప్పటికే ఉన్న 107 మంది ఎమ్మెల్యేలతో పాటు (విజయ్ రెండో సీటు తీసేస్తే) కాంగ్రెస్ 5, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ తలో రెండు సీట్లు కలుపుకుంటే మొత్తం 120 సీట్ల మద్దతు టీవీకేకు లభించినట్లయింది. దీంతో గవర్నర్ మరికాసేపట్లో విజయ్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంది. మరోవైపు డీఎంకేతో పాటు కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలన్నీ విజయ్ బాట పట్టినా అధినేత స్టాలిన్ మాత్రం వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తమను సంప్రదించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మిగతా పార్టీలను విజయ్ కు మద్దతుగా పంపి రేపు ప్రభుత్వంలో తమ సన్నిహితులు ఉండేలా చూసుకోవాలని స్టాలిన్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+