సీఎం రాజీనామా.. ముగిసిన శకం

కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(LDF) ఓటమిని చవిచూసింది. దాంతో దేశంలో కమ్యూనిస్టుల ఆధిపత్యానికి తెరపడింది. కేరళ అంటే పినరయి విజయన్ గుర్తుకు వచ్చేలా దాదాపు పదేళ్లపాటు ఆయన సీఎంగా పనిచేశారు. తాజాగా LDF ఘోర ఓటమిపాలు కావడంతో పినరయి విజయన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే తదుపరి ప్రభుత్వం ఏర్పడేంత వరకూ ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. కేరళలో 35 స్థానాల్లో మాత్రమే LDF విజయం సాధించగా ఏకంగా 102 స్థానాల్లో UDF భారీ విజయం సాధించింది. ఇక ఎన్డీయే కూటమి 3 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.

ఇక కేరళలో LDF పార్టీ తరఫున సీఎంగా పినరయి విజయన్ ఏకంగా 9 సంవత్సరాల 11 నెలల 9 రోజులపాటు పరిపాలించారు. అంటే మొత్తంగా ఆయన 3633 రోజులు సీఎం సీటులో కుర్చున్నారు. తాజాగా పినరయి విజయన్ రాజీనామాతో ఆయన శకం ముగిసినట్లుగా భావించవచ్చు. కేరళ రాజకీయాల్లో వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి విజయన్ రికార్డు సృష్టించారు. ఈ అరుదైన చరిత్ర ఆయనకే దక్కుతుంది. అయితే తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయన్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించారు.

LDF Crushed in Kerala Elections Chief Minister Pinarayi Vijayan Resigns End of an Era Vijayan

గత పదేళ్లలో పినరయి విజయన్ సారథ్యంలో కేరళలో LDF ప్రభుత్వం అనేక కీలక సవాళ్లను అధిగమించింది. 2018 భీకర వరదలు, 2021 కొవిడ్-19 లాంటి విపత్కర పరిస్థితులను తట్టుకుని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది కేరళ. ఇక కేరళలో ఓటమితో తమ చివరి కంచుకోటను కూడా కమ్యూనిస్టులు కోల్పోయినట్లుగా భావించవచ్చు. దీంతో గత 49 ఏళ్లలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని పరిస్థితి వారికి ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+