అక్కడ ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు?
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ఆరంభమైంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇదివరకే వెల్లడైన నేపథ్యంలో వీటిపైనే అందరి చూపూ నిలిచింది. ప్రారంభ ఫలితాలు ఉత్కంఠతకు గురి చేస్తోన్నాయి.
కేరళలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయ్యేలా కనిపిస్తోన్నాయి ప్రారంభ ఫలితాలను బట్టి చూస్తోంటే. ఇక్కడ వామపక్షాల సారథ్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ఓడి పోతుందని, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందంటూ ఇదివరకు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. వాస్తవ ఫలితాలు మాత్రం దీనికి భిన్నంగా వెలువడుతున్నాయి. ఎల్డీఎఫ్ ఆధిక్యత సాధించింది. మెజారిటీ మార్క్ కూ దగ్గరైంది.

ప్రారంభ ఫలితాల్లో ఎల్డీఎఫ్ ఆధిక్యత కనపర్చుతూ వస్తోంది. 65 సీట్లలో లీడింగ్ లో ఉండగా.. యూడీఎఫ్ అభ్యర్థులు 60 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఆధిక్యత చేతులు మారుతూ రావడం ఉత్కంఠతగా మారింది. ఇక గట్టి పోటీ ఇస్తుందని భావించిన భారతీయ జనతా పార్టీ ప్రభావం ప్రారంభ ఫలితాల్లో పెద్దగా కనిపించట్లేదు.
నెమామ్ నుంచి పోటీ చేసిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వయంగా ఇక్కడ ట్రయలింగ్ లో ఉన్నారు. ఆయనపై వీ శివన్ కుట్టి ఆధిక్యత సాధించారు. ఇదే పరిస్థితి మెజారిటీ స్థానాల్లో నెలకొంది. బీజేపీ అభ్యర్థులు మూడు, ఆ తరువాతి స్థానాలకు పరిమితం అవుతున్నారు.












Click it and Unblock the Notifications