నమ్మలేని నిజం.. రోడ్డు పక్కన చెట్టు కింద నోట్ల కట్టలు!

అదో నిర్మానుష్యమైన రహదారి.. తెల్లవారుజామున మసక చీకటి.. రోడ్డు పక్కన ఉన్న ఒక పాత చెట్టు కింద ఎవరూ లేని మూడు బ్యాగులు. అటుగా వెళ్తున్న ఒక రైతుకు ఆ బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించాయి. ఏదో ప్రాణహాని కలిగించే వస్తువులు ఉంటాయని భయపడుతూనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కానీ, కట్ చేస్తే.. పోలీసులు వచ్చి ఆ బ్యాగులు తెరిచి చూడగానే ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి. అందులో కట్టలకొద్దీ రూ.500 నోట్లు దర్శనమిచ్చాయి. ఏకంగా రూ.2.83 కోట్ల రూపాయల నగదు లభించడం ఆ ప్రాంతంలో పెను సంచలనం సృష్టించింది.

మధ్యప్రదేశ్‌లోని సన్వార్‌-ఉజ్జైన్‌ రహదారిపై భూట్టా స్క్వేర్‌ సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏదో భారీ డీల్ కుదుర్చుకోవడానికో లేదా పోలీసుల తనిఖీలకు భయపడో గుర్తుతెలియని వ్యక్తులు ఆ నగదును అక్కడ వదిలేసి వెళ్లినట్లు ప్రాథమికంగా అర్థమవుతోంది. మూడు బ్యాగుల నిండా కుక్కినట్లుగా ఉన్న ఆ నోట్ల కట్టలను చూసి స్థానికులు విస్తుపోయారు. పోలీసులు ఆ నోట్లను స్వాధీనం చేసుకుని లెక్కిస్తున్నంత సేపు అక్కడ ఏదో భారీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా వాతావరణం నెలకొంది.

Mystery Cash Bags in Madhya Pradesh Farmer Finds Rs 2 83 Crore Under Tree on Sanwer-Ujjain Highway Today
RBI గుడ్ న్యూస్: పొరపాటున డబ్బు పోయినా రూ. 25 వేలు వాపస్!
RBI గుడ్ న్యూస్: పొరపాటున డబ్బు పోయినా రూ. 25 వేలు వాపస్!

బ్యాగుల్లో 'ఫేక్' ట్విస్ట్!

అయితే, ఈ కథలో అసలైన ట్విస్ట్ నోట్లను లెక్కించే సమయంలో బయటపడింది. ఆ బ్యాగుల్లో ఉన్న నోట్లన్నీ అసలైనవి కావు. కట్టల పైన, కింద అసలైన 500 నోట్లను పెట్టి.. మధ్యలో రంగు కాగితాలు, చిత్తు కాగితాలు మరియు కొన్ని ఫేక్ కరెన్సీ నోట్లను పేర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇది కచ్చితంగా 'బ్లాక్ మనీ'ని వైట్ చేయడానికి లేదా ఎవరినైనా మోసం చేయడానికి (డబుల్ మనీ స్కామ్) వేసిన పక్కా ప్లాన్ అని అధికారులు అనుమానిస్తున్నారు. అమాయకులను నమ్మించి, అసలు నోట్లను తీసుకుని ఇలాంటి కట్టలను అప్పగించే ముఠా పనే ఇదని భావిస్తున్నారు.

Gold: కస్టమ్స్‌లో చిక్కుకున్న 5 టన్నులు! భారీగా పెరగనున్న ధరలు?
Gold: కస్టమ్స్‌లో చిక్కుకున్న 5 టన్నులు! భారీగా పెరగనున్న ధరలు?

వేట మొదలుపెట్టిన పోలీసులు

ఒకవేళ అది దొంగ సొత్తు అయితే అక్కడే ఎందుకు వదిలేశారు? లేక ఎవరైనా పోలీసులను చూసి భయపడి పారేశారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ భారీ నగదు వెనుక ఉన్న 'మాస్టర్ మైండ్'ను పట్టుకునేందుకు ఉజ్జైన్ పోలీసులు రంగంలోకి దిగారు. రహదారి పొడవునా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరిగిన వాహనాల వివరాలను సేకరిస్తున్నారు. ఈ నోట్ల కట్టల వెనుక ఏదైనా పెద్ద నెట్‌వర్క్ ఉందా? లేక స్థానికంగా జరుగుతున్న అక్రమ లావాదేవీల భాగమా? అనేది త్వరలోనే తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+